విద్యార్థులపై చిందిన రక్తపు చుక్కలకు.. ఓటుతో సమాధానం చెబుతారు : కవిత

Publish Date:Jul 22, 2026

Advertisement

 

నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించడం లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను రోడ్లపై పరుగెత్తించి రక్తం వచ్చేలా కొట్టడం ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధమని కవిత అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు భారత్ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీకేజీ వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులు ఎవరో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని దేశ ప్రజలంతా తీవ్ర ఆవేదనతో గమనించారని కవిత అన్నారు. విద్యార్థులు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు, వారిపై విరిగిన ప్రతి లాఠీకి ప్రజలు ఎన్నికల్లో ఓటు రూపంలో బీజేపీకి తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. 

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులను వెంటనే గుర్తించి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, మృతిచెందిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే వివరాలు వెల్లడించాలని కోరారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని, అలాంటి విద్యార్థులను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కవిత పేర్కొన్నారు. విద్యార్థుల గొంతు వినాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె విమర్శించారు.

NEET Paper Leak Controversy, Dharmendra Pradhan Resignation Demand, Kalvakuntla kavitha, Sonam Wangchuk, PM MODI

By
en-us Political News

  
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.