పీవోకే ప్రధానినౌతా.. నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన.!

Publish Date:Jul 23, 2026

Advertisement

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాను పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానిని అవుతానంటూ చేసిన ప్రకటన పాకిస్థాన్ లోనే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటన అన్ని విషయాలనూ అధిగమంచి ప్రపంచ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది.  సాధారణంగా   దేశ ప్రధానిగా  పని చేసిన  నాయకుడు ఎవరైనా సరే, ఆ తర్వాత ప్రాంతీయ లేదా స్థానిక పదవులను చేపట్టడానికి సుముఖత చూపరు. అటువంటిది  పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతానికి ప్రధాని కావాలని ఉందంటున్నారు. 

పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్..   వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక  వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ నగరం వేదికగా జరిగిన భారీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన నవాజ్ షరీఫ్, అక్కడ తన పిఎమ్‌ఎల్-ఎన్  విజయం సాధిస్తే.. పీవోకే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. 

నవాజ్ షరీఫ్ ప్రకటనకు  పీఓకేలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితులే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.   ప్రస్తుతం పీఓకేలో  ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, భరించలేని విద్యుత్ ఛార్జీలు,  వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా  ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో  లక్షల మంది రోడ్లపైకి వచ్చిఆందోళన చేస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి  పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధ చర్యలు, సైనిక బలగాల ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ పలువురు నిరసనకారులు అసువులు బాసారు.  దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఎ  ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహ జ్వాలల నుంచి తప్పించుకుని, ఓటర్లను ఆకట్టుకోవడానికి నవాజ్ షరీఫ్ పీవోకే ప్రధాని ప్రకటన చేశారని అంటున్నారు.  

Nawaz Sharif PoK PM, Pakistan Occupied Kashmir, Shehbaz Sharif, Muzaffarabad Rally

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.