ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణపై అక్రమాస్తులు రూ. 400 కోట్లు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీ లకు చెందిన మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగు లోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.  ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో రూ.1.23 కోట్లు విలువ చేసే నాలుగు నివాస ఫ్లాట్లు, అంజనేయ నగర్‌లో 160 చదరపు గజాల స్థలంలో నిర్మించిన రూ. 1.82 కోట్లు విలువ చేసే జీ+3 వాణిజ్య భవనం,  గుత్తాల బేగంపేట్‌లో 250 చదరపు గజాల స్థలంలో 2.90 కోట్ల రూపాయలు విలువ చేసే జీ+5 కమర్షియల్ భవనం ఉన్నాయి.  అలాగే ముత్యం వెంకట రమణ భార్య పేరుతో  నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబ డులు పెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది.

కూకట్‌పల్లి మూసాపేట అంజనేయన గర్‌లో పది అపార్ట్‌మెంట్లు నిర్మించి‌ నట్లు గుర్తించగా, వాటిపై సుమారు 20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశ ముందని పేర్కొన్నారు.

సోదాల్లో రూ. 52.02 లక్షల బ్యాంకు నిల్వలు, 2 వేల 94 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు,   30 లక్షల విలువైన గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 20 మద్యం సీసాలు, వీటిలో 19 విదేశీ, ఒక ఐఎంఎఫ్‌ఎల్ లభించగా, దీనిపై మదాపూర్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ సుమారు రూ.27.65 కోట్లుగా ఉన్నప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం 400 కోట్ల వరకు అక్రమాస్తులు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇంకా పలు ఆస్తులపై విచారణ కొనసాగు తోంది. ఇలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆయనకు  14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను   చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

Transco DE Muthyam Venkataramana,  Illegal assets,  400 crores, ACB raids,  Arrest, Judicial, Remand

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.