జగన్ కంటే నీరోయే నయం!

Publish Date:Jan 31, 2025

Advertisement

రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారన్నది నానుడి. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తుంటే నీరో చాలా చాలా నయం అనిపిస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోరాతి  ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికారంలో ఉండగా తమంత వారు లేరన్నట్లుగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడానికి భయంతో వణికి పోతున్నారు. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఇక ఎక్కడా అవకాశం లేని కొద్ది మంది మాత్రం త్వమేవ శరణం నాస్తి అన్నట్లు వైసీపీపి పట్టుకు వేళాడుతున్నారు. వారిలో కూడా అంబటి వంటి వారు తప్ప మరెవరూ పార్టీ కార్యక్రమాలలో  పాల్గొనడం లేదు. సాధ్యమైనంత వరకూ వార్తల్లో ఉండకుండా కౌపీన సంరక్షణార్థం అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించి దాదాపు రహస్య జీవనం గడుపుతున్నారు. 

ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కుమార్తెల దగ్గరకు అంటూ లండన్ చెక్కేశారు. సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన అంటూ ఊదరగొట్టేసిన ఆయన ఆ తరువాత ఆ మాటే ఎత్తడం లేదు. సరే అది అలా ఉంచితే తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి, జగన్ తన బలుపుగా ఇంత కాలం చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా చడీచప్పుడు లేకుండా విజయసాయి తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనుంటూ ట్వీట్ చేసేసి పనిలో పనిగా ఇంత కాలం తాను ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు, అసంబద్ధ విమర్శలతో రెచ్చిపోయారో వారి పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని కూడా చెప్పేసి తాను గతంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని జగన్ స్క్రిప్టేనని అన్యాపదేశంలో వెల్లడించేశారు. ఎదో  మొక్కిబడికి జగన్ కు తాను రుణపడి ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఇదంతా సరే విజయసాయి రాజీనామాతో వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అసలు ఎవరూ ఊహించని పరిణామం కావడంతో విజయసాయి రాజీనామాపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు తెలియలేదు. అందుకే విజయసాయి పార్టీ నుంచి నిష్క్రమించడంపై వైసీపీ నుంచి అధికారిక స్పందనే కరవైంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పెదవి కదపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. సాధారణంగా పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్న తరుణంలో ఏ నాయకుడైనా పార్టీ నేతలు, క్యాడర్ లో ధైర్యం నింపడానికి వారితో భేటీ అవుతారు. భరోసా ఇస్తారు. నేను ముందుండి నడిపిస్తానన్న స్థైర్యాన్ని ఇస్తారు. కానీ జగన్ అవేమీ చేయలేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన ఏపీకి  రాలేదు. బేంగళూరు వెళ్లి కూర్చున్నారు.

పార్టీ పరిస్థితి గురించి కానీ, విజయసాయి రాజీనామా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. విదేశీ విహారం తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుడగ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. ఇంకా జగన్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బాహాటంగానే చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చి జిల్లాల పర్యటనలు ప్రారంభించినా ఆయన వెంట నడిచేవారూ, నిలిచేవారు ఎవరూ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.