ఉప్మా యాక్ట్ వ్యాఖ్యలు కొడాలి నాని అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనం.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్య, అశ్లీల, అనుచిత పోస్టులు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం సంచలనంగా మారింది. వివాదాస్పద యూట్యూబర్,   బచ్చలకూరి జోసెఫ్  అలియాస్ ప్రశ్న రావణ్  అరెస్టుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని  చేసిన వ్యాఖ్యలు  కొత్త వివాదానికి తెర లేపాయి. దేశ భద్రతకు సంబంధించిన ఉపా యాక్ట్ ను కొడాలి నాని  ఉప్మా యాక్ట్  అని సంబోధించడంపై కూటమి వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ  తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాని నాని వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.  వైఎస్ జయంతి సందర్భంగా గుడివాడలో  జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. ప్రశ్న రావణ్ అరెస్టు, ఆయనపై కేసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలూ, కొడాలి నాని  రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని వంశీకృష్ణ అన్నారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై ప్రయోగించే ఉపా  చట్టాన్ని అపహాస్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు. 

దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే  ఉపా చట్టాన్ని  ఉప్మా యాక్ట్  అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను దూషించినందుకు రావణ్‌ను అరెస్ట్ చేయలేదనీ,  జోసెఫ్ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, అతను దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను నక్సలిజం, టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారని వెల్లడించారు. ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు అతనికి రిమాండ్ విధించిందని గుర్తుచేశారు.

వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తొలుత ఈ జోసెఫ్‌కు పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ఇస్తామని ప్రకటించి..  తీరా అతని ఫోన్ లోని వివాదాస్పద విషయాలు బయటపడగానే ప్లేట్ ఫిరాయించారని వంశీకృష్ణ ఆరోపించారు.  గతంలో వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి వంటి వారిని పెంచి పోషించి..  ఇప్పుడు వారితో మాకేం సంబంధం లేదన్నట్లే వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనల మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు గ్యాప్ తేవాలని చూస్తున్నారని, కానీ  అది అసాధ్యమన్నారు. 

కొడాలి నాని  రోజూ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేయాలని తాను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నానని వంశీకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయడం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల సాధన వంటి అభివృద్ధి పనులపై మాట్లాడుతుంటే, వైస్సార్సీపీ నేతలు మాత్రం గొడ్డళ్లు, బూడిద వంటి భాష వాడుతున్నారని, ప్రజలే అంతిమంగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారని చెప్పారు. 

Kodali Nani Upma Act, TDP Bandaru Vamsi Krishna Comments, Prasna Ravana UAPA Case, AP Politics Latest News, Telugu News

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.