సజ్జల, జగన్ మధ్య మావిగన్ చిచ్చు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

వైపీపీలో అంతర్గత పరిణామాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.  2024 అసెంబ్లీ   ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు జగన్ తీరుతో పార్టీలోని సీనియర్ నాయకులు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకే కాదు.. చివరాఖరికి అధినేత జగన్ కు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా   ప్రచారం సాగుతోంది. అధినేత జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సజ్జల పూర్తిగా విఫలమవుతున్నారని,జగన్ ఆయనపై   తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం.  

ఈ వివాదానికి  కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన  మావిగన్ అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి  విఫలమయ్యారని జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. సొంత మీడియాలో కూడామావిగన్ అంశానికి ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కకపోవడం జగన్ కు మింగుడుపడలేదు. మావిగన్ ను  సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం వెనుక  ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

మూడు రాజధానుల స్టాండ్ కారణంగా ప్రజాదరణ, ప్రజా విశ్వాసాన్నీ కోల్పోయామనీ, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ ప్రజజల్లోకి వెడితే ప్రతికూలత మరింత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో..   సజ్జల, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించారనీ, అవే సంకేతాలను క్షేత్రస్థాయికి కూడా పంపారనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడే.. జగన్ కు తన ఆదేశాలను కాదని సజ్జల స్వతంత్రంగా వ్యవహరించడం రుచించలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనై సజ్జలను ఒకింత తీవ్రంగానే మందలించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా,  పార్టీ సమన్వయకర్తగా, సకల శాఖల మంత్రిగా ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ  సర్వస్వం తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించారు.  ఆయన కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఈ ఆధిపత్యం పార్టీలోని సీనియర్ నేతలకు అస్సలు నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి సజ్జల అనుసరించిన ఏకపక్ష విధానాలే కారణమని సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి   కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డే  కారణమంటూ జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. కానీ మావిగన్.. విషయంలో సజ్జల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.   దీంతో సజ్జల కూడా పార్టీ వ్యవహారాలలో ఇక నుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి మధ్య ఈ విభేదాలు పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. 

YSRCP Latest News, Mavigan Capital AP, YSRCP Internal Cold War

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.