ఉండవల్లి నివాసం వద్ద 53 దీపాలు వెలిగించిన లోకేష్.. ఎందుకో తెలుసా?

Publish Date:Sep 9, 2026

Advertisement

జగన్ హయాంలో  అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును  అరెస్ట్ చేసిన సంఘటనకు సెప్టెంబర్ 9 తో మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్   గతంలో జరిగిన ఈ పరిణామాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా నిర్బంధంలో ఉంచిన కాలాన్ని స్మరిస్తూ..  సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి  జైలులో ఉంచారనీ..  ఆ చీకటి రోజును, అన్యాయాన్ని నిరసిస్తూ తాము ఎప్పుడూ న్యాయం వైపే నిలబడ్డామని ఆయన పేర్కొన్నారు.  సత్యమేవ జయతే అనే నినాదంతో, తన తండ్రి జైలులో గడిపిన ప్రతి రోజూ గుర్తుకు వచ్చేలా ఉండవల్లిలోని అధికారిక నివాసంలో  53 మట్టి దీపాలను వెలిగించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఐదు దశాబ్దాలకు పైగా ఎలాంటి మచ్చలేని ప్రజా జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన నాయకుడనిపేర్కొన్న లోకేష్..  ఆయనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎన్ని అబద్ధపు ఆరోపణలుచేసినా, ఎన్ని అక్రమ కేసులు మోపినా, ప్రజల ఆశీస్సులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల మద్దతుతో ఆయన  బయటకు వచ్చారని   ఉద్ఘాటించారు. కేవలం ఉండవల్లి నివాసంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లోనూ తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఈ 53 రోజుల నిర్బంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు, దీపోత్సవాలు నిర్వహించారు. 

గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీనియర్ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ నాయకత్వం ధైర్యంగా నిలబడింది. ఆ సమయంలో లోకేష్ పార్టీ శ్రేణులకు అండగా నిలవడంతో పాటు, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మార్చడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు మూడేళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. గత ప్రభుత్వ అరాచకాలను, కక్షసాధింపు రాజకీయాలను ప్రజలకు మరోసారి గుర్తుచేసేలా ఈ కార్యక్రమం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

[Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Undavalli residence, 53 earthen lamps, TDP updates, Andhra Pradesh politics]

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.