నాగార్జుసాగర్ నిర్మాణానికి నారు, నీరు పోసిందెవరు?

Publish Date:Aug 7, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గురించి తెలుసుకోవాలంటే  ఆయన కంటే  ముందు తరాలకు  చెందిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  గురించి తెలుసుకోవాలి!  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761, ఏప్రిల్ 27న జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. క్రీస్తు శకం 1413 నుండి తీరాంధ్ర ప్రాంతంలో ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికి చెందినవాడు వేంకటాద్రి నాయుడు. నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో  జగ్గయ్యపేట అనేది  తన తండ్రి పేరు   జగ్గ భూపతి పేరు మీద నిర్మించిన పట్టణం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి కుడివైపున ఉన్న అచ్చంపేటను తన తల్లి అచ్చమాంబ పేరు మీద అచ్చంపేటగా నిర్మించాడు.  నాటి అమరావతి నగర  నిర్మాత కూడా వేంకటాద్రి నాయుడే! తన రాజధాని  చింతపల్లి నుండి  అమరావతికి మార్చి అమరావతి శివాలయంతో పాటు  మొత్తం 108 దేవాలయాలు  కట్టించాడు. మంగళగిరి నరసింహ స్వామి గుడి గోపురం  కట్టించింది కూడా  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే!  ఆ గోపురం దేశంలోనే రెండో అతి పెద్ద గోపురంగా నిలిచింది అని చెబుతారు.  అమరావతి  అమరలింగేశ్వర స్వామి  సేవలో గడుపుతూ 1817, ఆగష్టు 17న శివైక్యం చెందారు. 

ఆ రాజవంశానికి  చెందిన  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆయనే ముక్త్యాల రాజాగా ప్రసిద్ధి. నాగార్జునసాగర్ కథలో ఆయనే హీరో..!  జగ్గయ్యపేట  అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ అలియాస్ ముక్త్యాల రాజా. ముక్త్యాల రాజాని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ప్రజలకు శాశ్వితంగా ఉపయోగేపడే పని చేయాలన్న తపనతో తలంపుతో  నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణం ఆలోచన వాసిరెడ్డి ప్రసాద్‌దే కావడం విశేషం.  మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులతో కలసి వుండగా  కృష్ణానది నీటిని తమిళ ప్రాంతానికి  తీసుకుపోవడానికి నాటి తమిళ కాంగ్రేస్ నాయకులు ప్రయత్నాలు  మొదలు పెట్టారు. అందులో భాగంగా  కృష్ణా,  పెన్నా నదులను అనుసంధానం  చేయడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు.  విషయం తెలుసుకున్న  వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ ఆంధ్రలో   తొమ్మిది జిల్లాలలో ప్రతి వూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి కేంద్ర  ప్రభుత్వానికి పంపారు.
 మాచర్ల నుండి దట్టమయిన అడవుల గుండా నందికొండ వరకు వెళ్ళి!  డ్యాంకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచేత ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం ప్రసాద్ ప్రయత్నాలకు అన్నివిధాలుగా  అడ్డుపడింది. వాసిరెడ్డి  మాత్రం  పట్టువదలని  విక్రమార్కుడిలా  కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు  ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ సభ్యులు అడవులల్లో పడి  మేం నందికొండకు చేరుకోలేం!  కార్లు కనీసం జీపులో వెళ్ళటానికి అనువైన దారి కూడా లేదు  అనే సాకుతో పక్కన పడేశారు. వాళ్ళు  అలా  చేయడానికి  వారిని  ఎవరు ప్రభావితం చేసి వుంటారు? తమిళ కాంగ్రెస్ నాయకులు.  

మరి నాటి  మన సీమ సింహాలు  ఏం చేశాయి?  ప్రత్యేక  తెలుగు రాష్ట్రం కోసం  పొట్టి శ్రీరాములు అనే  మహానీయుడు  56 రోజులు  కూడు లేకుండా  అమరణ నిరాహార దీక్ష  చేసి  అమరజీవి  అయ్యే వరకు  సీమసింహాలు  ఏం చేసాయో  నాగార్జున  సాగర్  ప్రాజెక్టును  పక్కన పెట్టినప్పుడు కూడా అదే చేసాయి.  పౌరహక్కులు,  అందరికీ  చదువు, నీరు పారి  బీడు భూములు  పచ్చటి  పంట పొలాలుగా  మారిపోతే  ప్రజలు  బాగుపడిపోతారు.  పెత్తందార్ల  ఆటలు  సాగవు కదా!  పచ్చటి  పంట పొలంలో  పేదలకు  వ్యవసాయ కూలిపని  దొరికితే వారి పిల్లలు  బడికి పోతారు!  మరి పెత్తందార్లకు  పాలేర్లు  దొరకరు.  ఒక్కపూట  జొన్న  రాగి ముద్ద కోసం  పెత్తందార్ల వెంట కత్తులు పట్టుకుని  ఎవరు నిలబడతారు! అందుకోసం మనకు పోలవరం  వద్దు  పులిచింతల వద్దు  సాగర్  వద్దు  ఇదీ అనాటి  పెత్తందార్ల కాలకూట  వికృత  రాజకీయం.  

రాజా వాసిరెడ్డి ప్రసాద్ పిచ్చోడు కదా! వేల రూపాయల తన సొంత డబ్బు ఖర్చు పెట్టి  ఇరవై ఐదు గ్రామాలనుండి ప్రజలను   స్వచ్చంద్ర సామాజిక   కార్యక్తర్తలను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి  కార్లు వెళ్ళటానికి  వీలుగా  దారి ఏర్పాటు చేయించాడు.  ఖోస్లా కమిటీ సభ్యులు నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టడానికి   ఇంతకన్నా మంచి చోటు వుండదని తేల్చారు .   ఢిల్లీ వెళ్లి ఆనాటి ప్రధాని నెహ్రు,  పటేల్ వంటి పెద్దలను కలిసి ప్రాజెక్ట్  గొప్పతనం వివరించి, నాగార్జున సాగర్ నిర్మాణంపై  ప్రభుత్వ పెద్దల దృష్టి పడేటట్లు చేశారు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టాడానికి   ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైయ్యాయి. వాసిరెడ్డి  ప్రసాద్ పలుమార్లు  ఢిల్లీ వెళ్ళి ఆచార్య ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య లాంటి  వారిని ఇతర  పార్లమెంటు సభ్యులను కలిసి, ఖోస్లా కమిటీ రిపోర్టు  ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరినీ విసిగించే పనిలో పడ్డాడు.  అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. ఎట్టకేలకు 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్‌  శంకుస్థాపన జరిగింది.   

ప్రాజెక్టుకు  నాగార్జున అని  ఎందుకు పెట్టారు.?  అక్కినేని  నాగేశ్వర్రావు  కొడుకు పేరు అని  కొందరు  అనుకునే  ప్రమాదం  వుంది. ఒకటి 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం తూర్పు దక్కన్‌లోని శాతవాహనుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ క్షేత్రం. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు, వేల సంవత్సరాల  చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు శాసనాలు లభించాయి. కొన్నింటిని ఇప్పుడు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న దీవిగా ఉన్న నాగార్జునకొండకు తరలించారు. మరి కొన్నింటిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు.   ఇది బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు  నడయాడిన  ప్రాంతం.   గౌతమి  పుత్ర  శాతకర్ణికి  రాజగురువు  ఆచార్య  నాగార్జునుడు.   ఆయన  పేరు మీద  నాటి  నెహ్రు ప్రభుత్వం   నాగార్జున  సాగర్  అని  పేరు పెట్టింది.  

శంకుస్థాపన  సమయంలో నెహ్రూ  మాట్లాడుతూ ఇటువంటి  సాగునీటి  ప్రాజెక్టులు  భారతదేశానికి  ఆధునిక  దేవాలయాలు  అని  వ్యాఖ్యనించారు.   పాపం  పిచ్చోడు  నెహ్రు   ఒక  భారీ గుడి కట్టి   ఈ దేశానికి ఇది  చాలు  ఇంకేం  అవసరం లేదు అని చెప్పకపోవడం  అమాయకత్వం  కాక  మరేమిటి?   ఎవరి కావాలండీ   ప్రాజెక్టులు,  అభివృద్ది !   మనకు  మన  కులపోడు  ముఖ్యం   మన  మత పోడు  ముఖ్యం  అదే కదా  నడుస్తున్న  భారత  దేశ చరిత్ర! సరే  అసలు  విషయానికి  వద్దాం. వాసిరెడ్డి  ప్రసాద్ యాభై రెండు లక్షల రూపాయలు మాచింగ్ గ్రాంటుగా ప్రాజెక్టు నిర్మాణానికి  విరాళం ఇచ్చాడు. 55 వేల  ఎకరాలు  పాజెక్టు కోసం  దానం ఇచ్చాడు . నాటికి  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్ట... నాగార్జున సాగర్ డ్యామ్. ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు. కేఎల్ రావ్‌గా  ప్రసిద్ది. ఆయన పర్యవేక్షణలో  పూర్తిగా స్థానిక పరిజ్ఞానంతో నిర్మించబడిన  సాగర్  1967న 4 ఆగస్టు నాటి  ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కుడి ఎడమ కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్  కల సాకారం  అయి 57 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్క్రిప్ట్ రాసే సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారు . ఏం చేస్తున్నారు మిత్రమా అని అడిగితే నాగార్జునసాగర్ నిర్మాణం జరిగి నేటికి  57 సంవత్సరాలు రాజు గారు   వార్త ప్రిపేర్ చేస్తున్నాను అని చెబితే !  సాగర్  నిర్మాణంలో  కమ్మవారి  పాత్ర  చెప్పొద్దు! నా ఫ్రెండ్  జగన్ రెడ్డికి తెలిస్తే  తెలిస్తే సాగర్ కూల్చే  ఏర్పాటు చేస్తాడు అని కామెంట్ చేశారు.

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.