బాలినేని మండ‌లికి, నాగ‌బాబు రాజ్య‌స‌భ‌కు?

Publish Date:May 20, 2026

Advertisement

జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు రాజ్యసభకు వెళ్లనున్నారా? అందు కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేయనున్నారా?   అన్న చ‌ర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 
 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రచారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు..  పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా  నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 

మాములుగా అయితే జ‌న‌సేన  త‌ర‌ఫున‌ లింగ‌మ‌నేని ర‌మేష్ ని రాజ్య‌స‌భ‌కు పంపుతారని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు జనసేనాని ఆయనకు గతంలో హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం లింగమనేని రామేష్ ను కాదని నాగబాబును రాజ్యసభకు పంపేయోచన చేస్తున్నారని అంటున్నారు.  ఇప్ప‌టికే నాగాబు జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పైకి  రీ ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ  ఆయ‌న ఢిల్లీ పాలిటిక్స్ లోకి  ఎంట్రీ ఇస్తే ఈ వినోద కార్య‌క్ర‌మాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. 

ఇక ఢిల్లీలో చ‌క్రం తిప్పేంత  సామర్థ్యం నాగ‌బాబుకు ఉందా? అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఢిల్లీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా ఉండి, పార్టీ వాయిస్ వినిపించాలంటే.. భాష చాలా ముఖ్యం. మరి హిందీ భాషలో నాగబాబు ప్రావీణ్యం ఎంత అన్న సందేహం వ్యక్తమౌతోంది.  ఇక రాష్ట్ర రాజ‌కీయాల్లోనే  నాగ‌బాబు త‌న కార్య‌క‌ర్త‌లు అడిగే  ప్ర‌శ్న‌ల‌కు తిక‌మ‌క ప‌డుతుంటారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ  విష‌యంలో నాగ‌బాబును బాగా త‌ప్పు ప‌డుతుంటార‌నీ పార్టీ వర్గాల్లోనే ఒక అభిప్రాయం ఉంది.  మ‌రి  అలాంటి  నాగ‌బాబు జాతీయ స్థాయిలో రాణింపు సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. 

ఇక  ఇటు ఒంగోలు రీజియన్‌లో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగబాబు గనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే..  ఖాళీ అయ్యే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి తరఫున బాలినేనికి కేటాయించే అవకాశం ఉంది. 

ఇక్క‌డింకో విచిత్ర‌మైన ప‌రిస్థితి  ఏంటంటే  ఒంగోలు ఎమ్మెల్యే దామంచ‌ర్ల జ‌నార్ధ‌న్ తో బాలినేనికి అస్స‌లు సరిపడదు. ఇద్ద‌రూ ఒకే కూట‌మికి  చెందిన నేత‌లే అయినా ఒక‌రిపై  మ‌రొక‌రు  ఆరోప‌ణ‌లు, విమర్శలు చేసుకుంటున్నారు. బాలినేని ఇంకా వైసీపీలో ఉన్న‌ట్టే త‌న‌పై  నింద‌లు వేస్తున్నార‌ని అంటారు జ‌నార్ధ‌న్. మ‌రి ఈ స‌మ‌స్యకు  ప‌రిష్కారం ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి ద్వారా అయినా ప‌రిష్కారం దొరుకుతుందా? అన్న‌ది  తేలాల్సి ఉంది.

బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అనుభవంతో ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇప్ప‌టికే నెల్లూరులో  జ‌న‌సేన‌కు   ఇంఛార్జ్ లేరు. బాలినేనిని మండలికి పంపడం ద్వారా ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఒక  కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంటుందా? అన్న‌ది తేలాల్సిఉంది.  ఇటీవల బాలినేని, సీఎం చంద్రబాబు నాయుడితో కూడా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.  అయితే ఇవ‌న్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సమాచారమే అయినప్పటికీ, దీనిపై జనసేన అధిష్టానం లేదా కూటమి పెద్దల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.