ప్రోఫెసర్ నాగేశ్వర్ కిరాయి ఎనలిస్ట్.. తెలుగువన్ ఇంటర్వ్యూలో అప్పసాని రాజేశ్ ఫైర్

Publish Date:May 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ విశ్లేషకుడు  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనీ, టీడీపీ కేవలం ఇన్స్టంట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ ఆయన సరికొత్త థియరీని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, జనసేన కోర్ కమిటీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని నాగేశ్వర్ పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ణత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.   తెలుగు దేశం, బీజేపీ  బంధం నిన్న మొన్నటిది కాదనీ..  1984లో ఎన్టీ రామారావు హయాం నుంచే రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు  పైగా ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధాన్ని ఇన్స్టంట్ ఫ్రెండ్ షిప్ అనడం నాగేశ్వర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

కూటమిలో   వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు.   ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్  జై ఆంధ్రప్రదేశ్' అని అనడాన్ని కూడా నాగేశ్వర్ తప్పుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ, కుల విభేదాలను రూపుమాపి సమైక్యతను తీసుకురావడానికే జనసేనాని ఆ నినాదం ఇచ్చారని స్పష్టం చేశారు.  వైసీపీ   హయాంలో మూడు రాజధానుల వివాదం వచ్చినప్పుడే  జై అమరావతి నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని, రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించినప్పుడు  జై ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల రాజధాని అన్న అప్పసాని రాజేశ్..  అది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమైనది కాదన్నారు.

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కేవలం అమరావతిపైనే నిధులు కుమ్మరిస్తున్నారనడం అబద్ధమని తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఇలాంటి సోకాల్డ్ ప్రొఫెసర్లకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విద్వేషాలు చొప్పించేందుకు జరుగుతున్న ఇటువంటి ఎజెండా బేస్డ్ ప్రచారాలను ప్రజలు నమ్మరనీ, భవిష్యత్తులో వీరికి తగిన బుద్ధి చెబుతారని అప్పసాని అన్నారు.  
 

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.