నాగార్జున వైసీపీలోకి వస్తే..జగన్‌కి లాభమా..? నాగ్‌కి లాభమా..?
Publish Date:Jul 7, 2017
Advertisement
రోజూ మీడియాలో..అంతకు మించి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూ ఉంటాయి..కొన్నింటి పై చూపు కూడా పడదు..కానీ కొన్ని వార్తలు మాత్రం రెప్పకూడా వేయకుండా చదువుతాం..ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమను, తెలుగు రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు, కింగ్ నాగార్జున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన ఒక వార్త ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారింది. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన నాగార్జున..యువసామ్రాట్‌గా, మన్మథుడిగా టాలీవుడ్‌ను మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్ కొట్టిన నాగార్జున..రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది నాగార్జునకి.. తొలి నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరొందినప్పటికీ ఇటీవలి కాలంలో బాలకృష్ణతో మనస్పర్థల కారణంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేడు..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది.. టీఆర్ఎస్‌లోకి వెళ్లలేడు..ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్. తన వ్యాపార సన్నిహితులంతా వైసీపీ అధినేత జగన్‌కు కావాల్సిన వారే కావడంతో..వారి ద్వారా ఆ పార్టీలో అడుగుపెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు కింగ్. దీనికి తోడు నాగ్‌కు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు నాగ్..కేంద్ర, రాష్ట్ర పథకాలను ఫ్రీగా ప్రచారం చేశారు కూడా. ఇప్పుడు వైఎస్ లేకపోయినా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు కింగ్..మొన్నామధ్య అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు స్వయంగా పరామర్శించి వచ్చారు కూడా.. మరి అలాంటి నాగార్జున కోరి పార్టీలోకి వస్తే జగన్‌కు అంతకన్నా కావాల్సింది ఏముంది. టీడీపీతో పోలిస్తే వైసీపీకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్పించి అక్కడ ఎవ్వరూ లేరు. ఈ సమయంలో నాగ్ వైసీపీ జెండా కప్పుకుంటే..టోటల్‌గా అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ జగన్‌కే..అదొక్కటేనా, నాగ్‌కు సన్నిహితులైన ఇండస్ట్రీ పెద్దలంతా ఫ్యాన్‌కు మద్ధతు తెలుపుతారు. కాబట్టి జగన్‌కు అన్ని రకాలుగా లాభమే..ఇక చేసే ప్రతీ పని వెనుక తన లాభాన్ని చూసుకుంటారు అన్న పేరున్న నాగార్జున ఇంకెంతలా ఆలోచించి ఉంటారు..నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న నాగ్ అందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి విజయావకాశాలు చాలా తక్కువ అని ఊహించి వైసీపీ మీద కన్నేశాడు..జగన్‌ను ఎలాగైనా ఒప్పించి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటి చేయాలని నాగార్జున స్కెచ్ గీస్తున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం మీద నాగార్జున కానీ..లోటస్ పాండ్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు..ఇది గాలి వార్తో, లేక నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా..? చూద్దాం ఏం జరుగుతుందో.
http://www.teluguone.com/news/content/nagarjuna-45-76150.html





