అయ్యో రామయ్య..!
Publish Date:Jul 7, 2017
Advertisement
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి టైం బ్యాడ్ గా వున్నట్టుంది! కోర్టుల్లో ఆయన ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దామనుకుంటే ఆయనకే చిక్కులొచ్చి పడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఆర్కే సుప్రీమ్ లో వ్యతిరేకత తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోదలిచిన భూముల విషయంలో ఆయనకు సుప్రీమ్ లో చుక్కెదురైంది. ఆయన పీటీషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది! కోర్టుల్లో కచేరీలు అంటే సంగీత కచేరీల్లా వుండవు. పక్కా ముందు చూపుతో కోర్టును ఆశ్రయించాలి. అదీ ఒక రాష్ట్రాన్ని పాలిస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మరింత జాగ్రత్తగా లాయర్లతో సంప్రదింపులు చేసి కోర్టు మెట్లెక్కాలి. కాని, ఆళ్ల అలాంటివేం చేస్తున్నట్టు లేదు. ఒకవైపు నాలుగు గ్రామాల్లో ప్రభుత్వం అక్రమంగా భూములు స్వాధీనం చేసుకుంటోంది అంటూ హైకోర్టును చేరారు. అక్కడ ఇంకా ఆ కేసు విచారణకు రాక ముందే సుప్రీమ్ కి వెళ్లి అదే విషయంపై పిటీషన్ వేశారు. అందుకే, సుప్రీమ్ కోర్టు జడ్జీలు ముందు హైకోర్టులో తేల్చుకుని తరువాత దిల్లీకి రావాలని సూచించారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే అప్పుడు చూద్దామని పీటీషన్ తిరస్కరించారు! ఇదే కాదు… ఈ మధ్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సదావర్తి భూముల విషయంలో కూడా హైకోర్టులో వ్యతిరక తీర్పు ఎదుర్కోక తప్పలేదు. కోర్టు భూములకి ధర నిర్ణయిస్తూ అంత మొత్తం చెల్లించిగాని భూములు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలా కాక భుముల్ని వదులుకుంటే ఆళ్ల రామకృష్ణ రెడ్డికి, ఐటీ మంత్రి లోకేష్ చెప్పినట్టుగా, అది రాజకీయ ఓటమే అవుతుంది! కోర్టు దాకా వెళ్లి భూముల్ని కోల్పోవాల్సిన స్థితిలో వున్నారు వైసీపీ ఎమ్మెల్యే! ఆర్కే డబ్బులు చెల్లిస్తే ఐటీ దాడులు, చేయకపోతే రాజకీయంగా అవమానం అన్నట్టుగా ఇబ్బందికర పరిస్థితిలో వున్నారు. లోకేష్ ఎలాగో విమర్శలు చేసి దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారాయన. కానీ, ఇంతలోనే సుప్రీమ్ లో మరో ఎదురుదెబ్బ ఆయనకి మింగుపడని విషయమే! ఇక త్వరలో అమరావతి భూముల గురించి ఆయన కేసు హైకోర్టులో విచారణకు రానుంది. అందులో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి!
http://www.teluguone.com/news/content/alla-ramakrishna-reddy-45-76148.html





