వైసీపీ రెబల్ ఎంపీకి ప్రాణహాని ఉందంటూ దాదాపు 70 మంది ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. సొంత పార్టీ నుంచే ఆయన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళనను వారా లేఖలో వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఆయనకు తన సొంత నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదని వారా లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూర విగ్రహావిష్కరణకు హాజరైన సంగతి తెలసిందే. ఈ సందర్బంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలు దేరిన రఘురామకృష్ణం రాజులను ఆయన ప్రయాణిస్తున్న రైలు బోగీని దగ్ధం చేసైనా హతమార్చాలని చూశారని ఆ ఎంపీలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అంతకు ముందు సీఐడీ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారనీ పేర్కొంటూ రఘురామరాజు గతంలో ఎంపీలకు లేఖలు రాసిన సంగతి విదితమే. ఆ లేఖలకు స్పందించిన వివిధ పార్టీలకు చెందిన దాదాపు 70 మంది ఎంపీలు ప్రధానికి లేఖ రాశారు.
అలాగే కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ఆయన తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తీరు హింసే నా ఆయుధం, హింసే నామార్గం అన్నట్లుగా ఉందని అన్నారు. అన్న క్యాంటిన్ల ధ్వసం ఘటనలను చూస్తుంటే ఈ ప్రభుత్వానికేమైంది అనిపించక మానదన్నారు.
అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ ముందుకు వచ్చే పరిస్థితి అనివార్యమౌతుందన్నారు. ఏపీ ప్రభుత్వానికి కోర్టుల మీద కానీ, కోర్టు తీర్పుల మీద కానీ గౌరవం ఉన్నట్లు కనబడటం లేదన్నారు.
ఇక రిషి కొండ తవ్వకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందన్నారు. రిషికొండపై ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తాను సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించిందని పేర్కొన్నారు. అయితే తన న్యాయవాది ఉమేష్ చంద్రకు రుషికొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారని రఘురామ రాజు అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mps-express-concern-about-rghuramaraju-security-writes-letter-to-pm-25-143245.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.