పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు.  ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, ముఖ్యంగా మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడం ద్వారా అధిష్ఠానం వద్ద తన పలుకుబడి ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్న రేవంత్ రెడ్డి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా గ్రిప్ సాధించారు, కొండా సురేఖ బర్త్ రఫ్ తరువాత.. పార్టీలో రేవంత్ వ్యతిరేకులలో, మరీ ముఖ్యంగా అసమ్మతి, అసంతృప్తి నేతల తీరులో, వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు గోచరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ బర్త్ రఫ్ అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారాయి.  ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడమే కాకుండా, రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవి విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తాజాగా విస్పష్టంగా వెల్లడించి తనలో మార్పును తెలియజేశారు.  తనకు మంత్రిపదవి విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అంతే కాకుండా.. కొండా బర్త్ రఫ్ కు ముందు వరకూ.. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలతో అనుచిత సంబోధనలతో విరుచుకుపడిన కొండా సుశ్మిత.. తన తల్లి కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన తరువాత మీడియా ముందు భోరుమని విలపించారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సబబు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్  ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. తన లండన్ పర్యటన కారణంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆమె చెబుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి జోరందుకోకుండా నివారించడంలో వైఫల్యం కారణంగా పార్టీ హైకమాండే ఆమెను తప్పించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలోనే జోరుగా సాగుతోంది. ఈ నెల 13న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రత్యేక కోర్సు అభ్యసించేందుకు లండన్ బయలు దేరుతున్నారు. కనీసం ఆమె పది నెలల పాటు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఇప్పటి వరకూ ఆమె స్థానంలో మరో ఇన్ చార్జిని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అంటు ఆమె అందుబాటులో ఉండని ఈ పది నెలల కాలం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆధిపత్యం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  

[Revanth Reddy Tightens grip On Party And Government, Telangana Congress, Konda Surekha, Komatireddy Rajagopal Reddy, Cabinet Expansion, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.