ప్రచారంలో తిరుపతి వెంకటరమణ స్టయిలే వేరయా!
Publish Date:May 25, 2012
Advertisement
ఒకవైపు బంధుత్వం, మరోవైపు కలగలుపుకునే రాజకీయ తత్వం కలిస్తేనే తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది. ఈయన ప్రచారం ప్రారంభించే పంథాయే కొంచెం కొత్తగా ఉంటుందని ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ముందుగా ఓటరును పరిచయం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్న తరువాత తనతో ఉండే బంధుత్వాన్ని ఆయన బయటపెడుతున్నారు. ఆ బంధుత్వం వల్ల ఆ ఓటరు ఇచ్చే గ్యారంటీతోనే ఆయన బయటకు వస్తున్నారు. చాలా అరుదుగా బంధుత్వాన్ని కలుపుకోవటమే కాకుండా ఇతర కులాల ఓటర్లనూ ఆయన స్నేహబంధంతో కలుపుకుంటున్నారు. ఆ స్నేహం ప్రచారం పూర్తయ్యేప్పటికి వారి మధ్యబంధం ఎంతగా బలపడుతోందంటే ఇక నేను వెళ్ళొస్తానంటే ఉండండీ అని వోటరు అనేంత దాకా చేరుకుంటోంది. దీంతో ప్రచార సమయం కొంచెం ఎక్కువైనా పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. వెంకటరమణ గెలుపు ఖాయమని ఈయన నిగ్గుతేలుస్తున్నారు. వెంకటరమణతో పాటు ఆయన ప్రచారంలో బుర్రకథ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు సులువుగా ఓటరును ఆకర్షిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/-24-14319.html





