మొరార్జి టు విజ‌య్...మైనార్టీ ప్ర‌భుత్వాలు వాటి ప‌ర్యావ‌స‌నాలేంటి?

Publish Date:May 10, 2026

Advertisement

 

మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు. అది మొత్తం  పార్ల‌మెంటు ఆమోదం ద్వారా తీసుకునే నిర్ణ‌యం. ఈ స్ఫూర్తి ఇలా ఉంటే, ఒక ప్ర‌భుత్వంలోనే ఒక మినీ పార్ల‌మెంటు అంటే, వివిధ పార్టీల క‌ల‌య‌క ఉంటే అది మ‌రో ర‌క‌మైన స‌మ‌స్య‌గానూ మారుతుంది.

ఆనాటి మొరార్జిదేశాయ్  నుంచి నేటి విజ‌య్ వ‌ర‌కూ.. సంకీర్ణ ప్ర‌భుత్వాల పుట్టినిల్లు కేర‌ళతో క‌లుపుకుని చూస్తే.. సంకీర్ణ ప్ర‌భుత్వాలేంటి?  భార‌త్ లో వాటి చ‌రిత్ర ఏంటి?  ఎదుర్కునే  స‌వాళ్లు ఎలాంటివి సోదాహ‌ర‌ణ‌గా గ‌మ‌నిస్తే.. మ‌న‌కు అనేక అంశాలు క‌నిపిస్తాయి. 

భారతీయ రాజకీయాల్లో సంకీర్ణ శకం అనేది ఒక అనివార్యమైన మలుపు. మొరార్జి దేశాయ్ కాలం నుంచి నేటి విజయ్- టీవీకే వరకు రాజకీయాల్లో అధికారం పంపిణీ అయ్యే తీరు మారింది. ఒకప్పుడు ఒకే పార్టీ ఆధిపత్యం ఉంటే, ఇప్పుడు అనేక‌ ప్రాంతీయ శక్తులు కేంద్ర బిందువులుగా మారాయి. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర, భారత్ లో పరిణామ క్రమం మొత్తం మూడు ప్రధాన దశలుగా చూడవచ్చు..

ప్రారంభ దశ 1977-1989 నాటిది. కాంగ్రెసేతర పక్షాలన్నీ కలిసి 1977లో  జనతా పార్టీగా ఏర్పడి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పాటు చేశాయి. అయితే, అంతర్గత కుమ్ములాటలతో ఇది రెండేళ్లకే కుప్పకూలింది.

1989-1999 మ‌ధ్య కాలానికి వ‌స్తే.. 1991లో పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహించినా, బయటి నుంచి మద్దతు కూడగట్టుకుని ఐదేళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్.. ద్వారా ఏర్ప‌డ్డ‌ దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్  ప్రభుత్వాలు మద్దతు ఉపసంహరణల వల్ల తక్కువ కాలం మాత్ర‌మే పనిచేశాయి.

స్థిరమైన సంకీర్ణాల దశ 1999-2014గా చెప్పాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని NDA 24 పార్టీల‌ను క‌లుపుకుని.. సంకీర్ణ ధర్మాన్ని పాటించి, ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని- UPA పదేళ్ల పాటు సంకీర్ణ పాలన సాగించింది.

ఇక‌ కేరళను.. సంకీర్ణ ప్రభుత్వాల పుట్టినిల్లుగా చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో దశాబ్దాలుగా సంకీర్ణాలే రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయి. అక్కడ LDF, UDF అనే రెండు బలమైన కూటములు ఉన్నాయి.

చిన్న చిన్న పార్టీలు కూడా ఈ కూటముల్లో చేరి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కేరళ మోడల్ ఏంటంటే—రాజకీయంగా విబేధించినా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా పాలన సాగించడం.

సంకీర్ణ ప్రభుత్వాలు ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివో ప‌రిశీలిస్తే.. సంకీర్ణ పాలన అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందులో ప్రధానంగా మూడు రకాల సవాళ్లు ఉంటాయని చెప్పాల్సి  ఉంటుంది.  

ఏదైనా పెద్ద నిర్ణయం ఫ‌ర్ స‌పోజ్.. ఆర్థిక సంస్కరణలు లేదా విదేశీ పెట్టుబడుల విష‌యంలై డెసిష‌న్ తీసుకోవాలంటే అన్ని మిత్రపక్షాలు ఒప్పుకోవాలి. ఒక్క పార్టీ అడ్డుపడినా ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. ఉదాహ‌ర‌ణ‌కు UPA-1 కాలంలో లెఫ్ట్ పార్టీల ఒత్తిడి వల్ల అణు ఒప్పందంలో తీవ్ర జాప్యం జరిగిన‌ట్టు.

చిన్న పార్టీలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసం మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని బెదిరిస్తుంటాయి.  గతంలో జయలలిత AIADMK  వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో పడగొట్ట‌గ‌లిగింది. 

సంకీర్ణ  ప్ర‌భుత్వాల్లో ఉమ్మడి కనీస ప్రణాళిక- CMP అత్య‌వ‌స‌రం. విభిన్న సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్, ముస్లీం లీగ్, ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన‌ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు ఎవరి ఎజెండా అమలు చేయాలనే దానిపై నిరంతరం సంఘర్షణ చెల‌రేగుతుంది.

తమిళనాడులో విజయ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా ఒక కొత్త  కూటమిని నిర్మించాలని చూస్తున్నారు. ఇందులో విజ‌య్ ఎదుర్కునే ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఏంటంటే.. ఒకవైపు మిత్రధర్మాన్ని పాటించాలి, మరోవైపు తన సొంత ఉనికిని సైతం కాపాడుకోవాలి.

విజయ్ వంటి కొత్త నాయకులకు సంకీర్ణ నిర్వహణ అనేది పరీక్షా సమయం. ఎందుకంటే, అధికారం పంచుకోవడం అనేది కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, బాధ్యతల పంపిణీ కూడా.

భారతదేశం వంటి భిన్నత్వంతో కూడిన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రతిబింబాలు. ఇవి ఏ ఒక్క పార్టీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. కానీ, అది సమర్థవంతమైన పాలన  దారి తీస్తుందా లేక  అస్థిరతకు కార‌ణ‌మ‌వుతుందా? అనేది ఆ కూటమిని నడిపే నాయకుడి నేతృత్వంపై ఆధారపడి ఉంటుంది. పీవీ నరసింహారావు తన మేధస్సుతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినట్లు, విజయ్ తన సినీ బుర్ర‌తో సంకీర్ణాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఒక సినిమా అంటేనే- 24 క్రాఫ్ట్ ల స‌మాహారం. సినిమాల నుంచి వ‌చ్చిన విజ‌య్ కి ఈ మాత్రం తెలియంది కాదు. తానొక హీరోగా  నిర్మాత‌ల‌పై ఎన్నో డిమాండ్ల‌తో ఒత్తిడి తెచ్చి ఉంటారు. ఇప్పుడాయ‌న త‌న సంకీర్ణ ప్ర‌భుత్వానికి తానే ఒక‌ నిర్మాత వంటి వారు. మ‌

రి ఒక‌టీ అరా సీట్లిచ్చి కూడా భారీ ఎత్తున ప్ర‌యోజ‌నాల‌ను కోరే వారిని ఆయ‌న ఎలా  శాంత ప‌రుస్తారు? ఎలాంటి  టెక్నిక్స్ ఫాలో అవుతారు? ఎలాంటి ప్ర‌య‌రోగాలు చేసి వారిని కంట్రోల్లోకి తెచ్చుకుంటార‌న్న నాట‌కం ఇక ముందు ముందు రంజుగా మార‌నుంద‌ని మాత్రం అంటున్నారు. మ‌రి చూడాలి.. ఈ అనుభ‌వ రాహిత్యంతో కూడిన సినీ హీరో ట‌ర్న‌డ్ పొలిటీషియ‌న్ ఉద్దండ  పిండాలైన ఈ సీనియ‌ర్ త‌మిళ‌ పొలిటీషియ‌న్ల‌ను ఎలా దారిలోకి తెస్తారో తేలాల్సి ఉంది. అన్నిటిక‌న్నా  ముందు.. త‌న హామీల‌ను ఆయ‌న ఎలా నెర‌వేర్చుతార‌న్న‌ది కూడా  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  ని త‌ల‌పిస్తోంది.


 

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.