తోటకు మంత్రిపదవి

Publish Date:Jun 25, 2012

Advertisement

రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 12వేల మెజార్టీతో గెలుపొందిన తోటకు మంత్రి పదవి ఇస్తే బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా తోటత్రిమూర్తులుకు పేరుంది. ఈ వర్గం శాంతిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకలాంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకనైనా తోటకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలే సిఎం కిరణ్‌కుమర్‌రెడ్డికి సూచిస్తున్నారు. పైగా, గెలిచిన రెండు స్థానాల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై విజయం సాధించటం అంటే మాటలు కాదని రాజకీయ ఉద్దండులే అభిప్రాయపడుతున్నారు.

పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌ రామచంద్రపురం నియోజకవర్గంలో బిసిల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన్ని ఈ నియోజకవర్గంలో ఓడించటమే కష్టం. అటువంటిది తోట త్రిమూర్తులు గెలిచినందుకు నియోజకవర్గంపై పట్టుఉండాలంటే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇంకోరకంగా చూస్తే కోనసీమకు మంత్రి పినిపే విశ్వరూప్‌, మెట్టప్రాంతానికి మంత్రి తోటనర్సింహం మధ్యలో జిల్లాకు కీలకమైన స్థానం రామచంద్రపురం. అందువల్ల ఇక్కడ కూడా మంత్రి పదవి ఇస్తే తూర్పుగోదావరి జిల్లాపై ముగ్గురుమంత్రులూ పట్టున్నవారే అవుతారని సూచనలు వస్తున్నాయి. రాజకీయంగా తూర్పుగోదావరి ఓటరు ఎటుతీర్పు ఇస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు మంత్రిపదవులు ఇవ్వకతప్పదని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎక్సయిజ్‌శాఖను కోరుకుంటున్నారు. కానీ, ఈ నియోజకవర్గం మొదలుకుని జిల్లాలో వెనుకబడిన తరగతులపై పట్టుకోసం, తరువాత (2014) ఎన్నికల్లో విజయం కోసం బిసి, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పదవి అయితే బాగుంటుందని మేథావులు సూచిస్తున్నారు.

చిత్రంగా ఈ విషయంపై ఎన్ని సూచనలు వచ్చినా సిఎం కిరణ్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే మంత్రి పదవి ఇచ్చినా చిరంజీవి వ్యాఖ్యానాలు దృష్టిలో ఉంచుకుని కీలకశాఖ ఇవ్వకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. తాను సోనియాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తోటత్రిమూర్తులు అనుచరులకు చిరంజీవి దాదాపు హామీ ఇచ్చారు. చిరంజీవి అక్కడికి వెళ్లేలోపే కిరణ్‌ తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తోటను పిలిపించి మరీ మంత్రి పదవి కేటాయించవచ్చని కిరణ్‌ సన్నిహితులు భావిస్తున్నారు. ఎందుకంటే కిరణ్‌ సిఫార్సు కన్నా తాను స్వయంగా తీసుకునే నిర్ణయానికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని అందరికీ తెలిసిందే. అందుకే కిరణ్‌ పిలుపు కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో తోట అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By
en-us Political News

  
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.