రోజాకు హోంశాఖ!.. విజ‌య‌సాయితో డీల్‌! మిగ‌తా వాళ్ల సంగ‌తేంటి?

Publish Date:Mar 19, 2022

Advertisement

ఎలాగైనా త‌న‌కు మంత్రి ప‌ద‌వి రావాల్సిందే. అందులోనూ ఏదో చిన్నాచిత‌కా శాఖ కాదు.. చేస్తేగీస్తే త‌న‌ను హోంమంత్రిని చేయాల్సిందే. ఇదీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా జ‌బ‌ర్ద‌స్త్ ప్లాన్‌. అయితే, జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ లాంటి.. పెద్దిరెడ్డి త‌న మినిస్ట‌ర్ పోస్ట్‌కు అడ్డుప‌డుతుండ‌టంతో.. అధినేత‌కు లెఫ్ట్‌హ్యాండ్ లాంటి విజ‌య‌సాయిరెడ్డితో క‌థ న‌డుపుకొస్తున్నారు రోజా. ఇటీవ‌ల నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డితో తాడేపల్లిలో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం కోసం వీరిద్దరు సమావేశమయ్యారని చర్చ అయితే నడుస్తోంది. కేబినెట్‌లో బెర్త్ కన్‌ఫార్మ్ చేసుకునేందుకే విజయసాయిరెడ్డితో రోజా మంతనాలు జరిపిందనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. కొత్తగా కొలువు తీరుతోన్న ఈ కేబినెట్ రానున్న ఎన్నికల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో రోజాకు కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ అల్ హోం శాఖను ఆమెకు కట్టబెట్టే ఛాన్స్ లేకపోలేదని టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటి వరకు హోం మంత్రిగా ఉన్న ఎం. సుచరిత స్థానాన్ని రోజా అందుకొనుందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుది, రోజాది ఒకే జిల్లా. ఈ నేపథ్యంలో రోజాకు హోం శాఖను కట్టబెడితే.. రానున్న ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక.. ఆర్కే రోజా ప్రధాన ప్రత్యర్థి, అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కూడా ఈ విషయంలో సీఎం జగన్ ఒప్పించారనే టాక్ కూడా అమరావతి సాక్షిగా నడుస్తోంది.   

మరోవైపు జగన్ కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజులు సెఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారంతా మాజీ మంత్రులుగా మారి.. జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జులుగా కొత్త అవతారం ఎత్తుతారని సమాచారం. కేబినెట్‌లోకి కొత్తగా రెడ్డి సామాజిక వర్గం నుంచి అయిదుగురిని తీసుకోవాలని సీఎం జగన్ భావించారట. వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికలే కాదు.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఆయన చాలా కష్ట పడ్డారని సీఎం జగన్ అందిన నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అదే జిల్లాకు చెందిన అనంత వెంకట్రామిరెడ్డికి కూడా మినిస్టర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. కర్నూలు జిల్లా నుంచి శిల్ప చక్రపాణిరెడ్డి, సాయి ప్రసాద్‌లు.. చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి కూడా స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. కడప జిల్లా నుంచి చీప్ వీప్ జి శ్రీకాంత్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ అనుకున్నారట. 

ఇక మైనారిటీ విషయానికి వస్తే.. కడప జిల్లాకు చెందిన అంజాద్ బాష ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాకు ఆ ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. పార్టీలో ఆయన సూపర్ సినియర్‌గా ఉన్నారని.. అందుకే జగన్ ఆయనవైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. మరోవైపు ఈ పదవి కోసం కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాష, పార్టీ ఎమ్మెల్సీ, ఐపీఎస్ మాజీ అధికారి ఇక్బాల్‌లు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని తెలుస్తోంది. 

జగన్ కేబినెట్‌లో కొడాలి నానికి కదపకూడదని జగన్ అనుకుంటున్నారట. చంద్రబాబు ఆయన పార్టీ మీద మూడో కాలు మీద లెగిసే... కొడాలి నానిని మాత్రం మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీఎం ఇష్టపడడం లేదని సమాచారం. ఇక మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లను తప్పించి వారి స్థానంలో ఆయా సామాజిక వర్గాల వారితో భర్తీ చేసే తలంపులో జగన్ ఉన్నారట. అలాగే ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్యకు కూడా మంత్రి పదవి కట్టబెడతారనే ఊహగానాలు కడప జిల్లాలో జోరుగా నడుస్తున్నాయి. బీసీ కులాలకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను తొలగించి ఆ స్థానంలో విడదల రజనీ, పార్థసారథిలకు పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. ఇక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పల రాజును కొనసాగించనున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి నారాయణస్వామి,పి. విశ్వరూప్, ఎం సుచరిత, ఏ సురేష్‌లను తొలగించి.. వారి స్థానంలో తలారి వెంకట్రావ్, కొండేటి చిట్టిబాబు, గొల్లబాబురావులకు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 

అలాగే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే ఆర్థర్, సుధాకర్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, కలివేటి సంజీవయ్యలు మంత్రిపదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఎస్టీల నుంచి పుష్ప శ్రీవాణిని తొలగించి ఆ స్థానంలో వి.కళావతిని కూర్చొబెట్టాలని జగన్ అనుకుంటున్నారట. ఇక బ్రాహ్మణ వర్గానికి  వచ్చే సరికి మల్లాది విష్ణు లేదా కొన రఘుపతిలలో ఒకరికి ఛాన్స్ దక్కతోందట. మరి వీరిలో ఎవరికీ లక్కీ ఛాన్స్ అనేది త్వ‌ర‌లోనే తెలిసిపోనుంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.