జమ్మలమడుగు 'ఆది'తో పెట్టుకుంటే తల లేచిపోద్ది
Publish Date:Mar 29, 2012
Advertisement
కడపజిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి తన విశ్వరూపాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులకు చూపించారు. తనతో పెట్టుకుంటే తలలు లేచిపోతాయని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి నాగేంద్రయాదవ్ కు ఇటీవల ఆదినారాయణరెడ్డి ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఎవరైనా వేలుపెడితే వారి తల తీసేస్తానని బెదిరించారు. మిగతా ఊళ్ళలో లాగా తన నియోజకవర్గంలో ప్ర్రతీ నాయకుడు రాజకీయం చేస్తే సహించేది లేదని బండ బూతులు తిట్టారు. ఏ కులం వాడు ఆ కుల వృత్తి చేయాలే తప్ప రాజకీయాలు చేస్తే శవాలు లేచిపోతాయని నాగేంద్రకు వార్నింగ్ ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నాగేంద్ర వాపోతున్నారు. ఆదినారాయణరెడ్డిపై నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఇంతవరకు కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించలేదు.
http://www.teluguone.com/news/content/mla-adinarayana-reddy-24-13003.html





