పయ్యావుల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీరో

Publish Date:Mar 7, 2026

Advertisement

 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటు శాసనసభ, ఇటు శాసన మండలిలో ఆర్థిక శాఖ,శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ సర్వం తానై అదరగొట్టారని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్ని హితుల్లోఒకరైన పయ్యావుల వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూటిగా సుత్తి లేకుండా సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడటంలో కేశవ్‌ పరిణితి చెందారు. పరుషపదజాలం లేకుండా ప్రత్యర్ధులను టార్గెట్ చేయడంలోనూ ఆయన స్టైలే వేరుగా ఉంటుంది.  

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచిన పయ్యావుల కేశవ్ కష్టకాలంలో పార్టీకి  అండగా నిలిచి వాయిస్ వినిపించే సీనియర్ నేతల్లో ముందువరుసలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించే వరకు ఆయన సీనియార్టీకి తగిన గుర్తింపు దక్కలేదు, పయ్యావుల బ్యాడ్ టైమో లేకపోతే పార్టీ బ్యాడ్ టైమో కాని ఆయన ఉరవకొండలో గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదన్న ముద్ర ఉండేది. దానికి తగ్గట్లే 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ పవర్ లోకి వస్తే దురదృష్టవశాత్తు కేశవ్ ఓడిపోయారు. అయితే ఆ నెగిటివ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తూ 2024లో గెలుపొందిన ఉరవకొండ ఫైర్ బ్రాండ్ తన కెరీర్లో తొలిసారి మంత్రయ్యారు. 

ఆర్థిక ,ప్రణాళిక, వాణిజ్య పన్నులు,అసెంబ్లీ వ్యవహారాలు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తాజా బడ్జెట్ సమావేశాల్లో తానేంటో నిరూపించుకున్నారు.  పయ్యావుల మాట్లాడే శైలి సాధారణంగా డేటా బేస్డ్‌గా, చేస్తున్న ఆరోపణలకు ప్రత్యక్ష ఉదాహరణలతో సాగుతూ, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకే సభలో ఆయన స్పీచ్ ఎప్పటికప్పడు హైలెట్ అవుతుంటుంది. ఆ వాగ్దాటితోనే తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అటు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఇటు శాసనమండలిలో వైసీపీ సభ్యులకు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆయన 'ఊపేశారు" అని పార్టీల కతీతంగా నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని టార్గెట్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వైసీపీ సభ్యుల తరహాలో అసభ్యతకు తావివ్వకుండా ఆయన వేసిన సెటైర్లు హైలెట్ అవుతున్నాయి. మాజీ సీఎం జగన్‌ని పులివెందుల ఎమ్మెల్యే అంటూ.. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.  సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల వారీ సమీక్షల్లో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. పులివెందుల సమస్యలను గత పాలకులు గాలికి వదిలేస్తే.. కూటమి ప్రభుత్వం పరిష్కారానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. 

ఆ క్రమంలో రాష్ట్రానికి వైసీపీ హానికరమనే వార్నింగ్‌ ఇస్తూ.. ‘వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. కూటమి వన్స్‌ ఎగైన్‌ ’ అని పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు నినాదంగా మారుతున్నాయి.ఇక శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నా, మంత్రి నారా లోకేష్‌తో కలిసి కేశవ్ వారి నోళ్లు మూయించిన తీరుపై కూటమి శ్రేణులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యానారాయణ వంటి సీనియర్ పయ్యావుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబాటుకు గురయ్యారు. విద్యావంతుడైన పయ్యావుల సభలో సీనియర్ ల పట్ల చూపిన వినయం వారిని మంత్రముగ్ధులను చేశాయి. 

జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా  కేశవ్ పై ప్రశంసలు కురిపించారు. పయ్యావుల కేశవ్ లాంటి వారు తోడుంటే చంద్రబాబుకి ఏదైనా సాధ్యమే అని జనసేనాని స్వయంగా అన్నారంటే సభలో కేశవ్ వ్యవహార శైలి ఎలా ఉందో అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఉన్న సీనియర్లకు ప్రయార్టీ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నిరూపించారు పయ్యావుల. భవిష్యత్ అవసరాలు, యువతకి ప్రాధాన్యత అంటూ పార్టీకి ముందు నుంచి అండగా ఉంటూ, చంద్రబాబు వ్యక్తిగత సైన్యం లాంటి వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తేనే పార్టీకి తిరుగుండదని సూచిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు.. 'పయ్యావుల నామ సమావేశాలు" గా మిగిలిపోతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


 

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.