మంత్రి లోకేష్ ఓఎస్డీ రెండు స్వర్ణ పతకాలు.. ఎందుకంటే?

Publish Date:Jun 11, 2026

Advertisement

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ.. విద్యారంగంలో చూపిన ప్రతిభకు గాను రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పని చేస్తున్న డాక్టర్  కాశిరెడ్డి వరప్రసాద్  ఆర్థిక శాస్త్రంలో  పీహెచ్‌డీ పరిశోధనకు గాను ఈ ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాలను సాధించారు.  తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకల్లో డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కు ఈ గౌరవం దక్కింది.  ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే..  మరోపక్క సమాజానికి ఉపయోగపడే ఆర్థిక పరిశోధనలు చేసి ప్రతిభను చాటుకున్న ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం   నిర్వహించిన 63 నుంచి 68  ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్  ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ ఈ స్వర్ణ పతకాలను అందుకున్నారు.  విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్  డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్' లభించాయి. ఒకే వేదికపై  డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ రెండు ప్రతిష్టాత్మక పతకాలను అందుకోవడం విశేషం. 

డాక్టర్ వరప్రసాద్ ఎంచుకున్న పరిశోధనా అంశం ప్రస్తుత ఆధునిక నగరాల అభివృద్ధికి ఎంతో కీలకం. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ ఎలా చేయవచ్చు అన్న  అంశంపై ఆయన  పరిశోధన చేశారు. ఈ ఆర్థిక విధానాన్ని అటు ప్రభుత్వాలకు భారం కాకుండా, ఇటు పెట్టుబడిదారులకు  లాభదాయకంగా ఎలా మార్చవచ్చో ఆయన తన పీహెచ్ డి సిద్ధాంత గ్రంథంలో విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు.   దేశ ఆర్థిక ప్రగతికి, పట్టణాల రూపురేఖలు మార్చడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. 

డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, ప్రభుత్వ పాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా సేవలు అందిస్తూనే.. డిప్యూటేషన్‌పై మంత్రి నారా లోకేష్ వద్ద ఓఎస్డీగా   కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన ఆర్థిక గణాంకాలపై మీడియాలో వచ్చిన కొన్ని కథనాల నేపథ్యంలో ఆయనపై  తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. సస్పెన్షన్ కు కూడా గురయ్యారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా రాణిస్తూ, విద్యారంగంలోనూ గోల్డ్ మెడల్స్ సాధించి తన సత్తా చాటారు.

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.