కాంగ్రెస్ అభ్యంతరాలు బేఖాతర్.. పరిమళ్ నత్వానీ నామినేషన్‌ ఆమోదం!

Publish Date:Jun 10, 2026

Advertisement

జార్ఖండ్ వేదికగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత  వైసీపీ ఎంపీ  పరిమళ్ నత్వానీ చుట్టూ ఇప్పడు జాతీయ రాజకీయం తిరుగుతోంది. జార్ఖండ్ నుంచి ఎన్డీయే, మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన  పరిమళ్ నత్వానీ నామినేషన్ పై  ప్రత్యర్థి వర్గాల నుంచి  అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ సహా

 జార్ఖండ్ ముక్తి మోర్చా  నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే   వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ  కాంగ్రెస్  ఆరోపించింది. ఈ అక్రమాల నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను   తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఒత్తిడి తెచ్చాయి.

అయితే.. కాంగ్రెస్ కూటమి అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ..   రిటర్నింగ్ అధికారి రంజీత్ కుమార్  1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 36(2) ప్రకారం పరిమళ్ నత్వానీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడానికి ఎలాంటి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ పరిమళ్ నత్వానీ నామినేషన్ కు ఆమోదముద్ర వేశారు.  దీనిపై కాంగ్రెస్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరలోనే ఈసీఐని  ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.  

జార్ఖండ్‌లోని మొత్తం 2 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న   ఎన్నికలు జరగనున్నాయి. ఈ బరిలో జేఎంఎం తరపున వైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ తరపున ప్రణవ్ ఝా బరిలో ఉన్నారు.  నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (జూన్ 11)  తుది గడువు.  ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం  ఇండియా' కూటమికి ఒక రాజ్యసభ సీటు సులభంగా దక్కనుంది. కానీ, రెండో స్థానం కోసం పరిమళ్ నత్వానీ స్వతంత్రుడిగా బరిలో నిలవడంతో పోరు  ఆసక్తికరంగా మారింది.  

By
en-us Political News

  
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోగా, ఐటీ రంగ షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యూపీఐ మోసాల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలు మరియు సైబర్ ముప్పుల గురించి బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ గణాంకాలు మీకోసం.
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి, 200 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నిర్లక్ష్యపు షాట్‌తో హాఫ్ సెంచరీని ఎలా చేజార్చుకున్నాడో పూర్తిగా చదవండి.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.