మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మేడే విషెస్
Publish Date:May 1, 2026
Advertisement
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని పేర్కొన్నారు. కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులే దేశానికి అన్నదాతలని, వారి శ్రేయస్సు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మెరుగైన ధరలు, సాగుకు అవసరమైన మద్దతు, ఆధునిక సాంకేతికత అందించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతి కార్మికుడి జీవన ప్రమాణం మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
http://www.teluguone.com/news/content/minister-kinjarapu-atchannaidu-may-day-wishes-36-218689.html





