చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. అనగాని.!

Publish Date:Sep 9, 2026

Advertisement

స్కిల్ కేసు పేరిట మూడేళ్ల కిందట అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని అప్పుడు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఆ అరెస్టు అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.   కక్షసాధింపు ధోరణితో వ్యవహరించి అక్రమంగా చేసిన ఆ అరెస్ట్, అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని నియంతృత్వ పాలన  పతనానికి నాంది పలికింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10) నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీపై విరుచుకుపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన నాలుగున్నర దశాబ్దాల   రాజకీయ అనుభవంఉన్న, అలాగే  ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చలేని నిజాయితీపరుడైన చంద్రబాబును అర్ధరాత్రి వేళ అన్యాయంగా అదుపులోకి తీసుకున్న జగన్ తీరును దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టు జరిగిన రోజును  తెలుగు జాతి చరిత్రలోనే  బ్లాక్ డేగా అభివర్ణించారు. ఎలాంటి  ఆధారాలు లేకుండానే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు అరెస్టుకు కుట్ర చేశారని విమర్శించారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అక్రమంగా లబ్ధి పొందినట్లు ఎక్కడా నిరూపణ కాలేదని, దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా అదే స్పష్టం చేశాయని గుర్తు చేసిన మంత్రి అనగాని..  రాజకీయ కక్షలతో   53 రోజుల పాటు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడిపై జరిగిన ఈ అన్యాయాన్ని భరించలేక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకం, పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి నిరసనలు తెలిపాయని ఆయన గుర్తు చేశారు.

నాడు నంద్యాల వేదికగా జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు.. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై  వ్యతిరేకతను రగిలించిందనీ, ఆ వ్యతిరేకత, ఆగ్రహావేశాలే..  ఆనాడు వైఎస్ జగన్ పాలనకు చరమగీతం  పాడటానికి ప్రధాన కారణమయ్యాయని అనగాని అన్నారు.  చంద్రబాబు అరెస్టు తరువాత  రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చారిత్రక మార్పునకు దారితీశాయనీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఒక బలమైన రాజకీయ కూటమిగా ఏర్పడి, భారతీయ జనతా పార్టీని కలుపుకుని ముందుకుసాగాయన్నారు.   ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రజలు ఈ కూటమికి బ్రహ్మరథం పట్టారని తెలిపారు.  

[Minister Anagani Satya Prasad On Chandrababu Naidu Illegal Arrest, YS Jagan Mohan Reddy, Skill Development Case, Telugu Desam Party, Telugu One]

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.