మేకపాటిపై కేసు ఎందుకంటే?
Publish Date:Aug 11, 2026
Advertisement
నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నాయకుడు మేకపాటి విక్రమ్‌రెడ్డితో పాటు మరో 13 మంది ముఖ్య నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బమెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గత నాలుగు రోజులుగా ఆత్మకూరు వేదికగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే తమ నిరసన స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు వైసీపీ నాయకులు ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా నిబంధనలను అతిక్రమించి ర్యాలీ నిర్వహించినందుకు గాను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డితో సహా మొత్తం 13 మంది ముఖ్య నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. Mekapati Vikram Reddy, YSRCP leaders case, Atmakur police case, Mega DSC protest, Nellore politics, AP po;itics, TeluguOne
http://www.teluguone.com/news/content/mekapati-vikram-reddy-36-228619.html





