దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు.!

Publish Date:Aug 18, 2026

Advertisement

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే మెగా డీఎస్సీ నిర్వహణపై  మంత్రి నారా లోకేష్  స్పష్టత ఇచ్చారు. గత కొన్ని నెలలుగా  వైసీపీ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలను   తీవ్రంగా ఖండించడమే కాకుండా,  సభకు రాకుండాబయట వైసీపీ  లేవనెత్తిన ప్రతి అనుమానానికీ, సవాల్ కూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సభలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇకనైనా వైసీపీ విమర్శలు, ఆరోపణలూ మానుకుని సభలో చర్చకు రావాలన్నారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు   విక్రమ్ పోలా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

వైసీపీ తీరు చూస్తుంటే.. ఇటీవల జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లలో  కొన్ని టీమ్ లు టోర్నీ ఆరంభానికి ముందు దూకుడు ప్రదర్శించి వాస్తవంగా మ్యాచ్ వచ్చేసరికి చతికిల బడినట్లుగా ఉందన్నారు.  మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ చేసిన, చేస్తున్న ఆరోపణలు, అనుమానాలను లోకేష్ ప్రస్తావించి క్లారిటీ ఇచ్చారు. దీంతో కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 

డీఎస్సీ విషయంలో వైసీపీ ఆరోపణల్లో పస లేదని లోకేష్ వివరణతో తేటతెల్లమైందన్నారు. ఇప్పటికే డీఎస్సీ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని విక్రమ్ పోలా అన్నారు. ఇప్పుడు ఇక లోకేష్ వివరణతో.. వైసీపీ ఇకపై డీఎస్సీ విషయంలో ఆందోళనలు చేయడం సాధ్యం కాదన్నారు. అందకే మండలిలో అచ్చెంనాయుడు బొత్సపై అనుచిత వ్యాఖ్యలు చేశరంటూ చేసిన ఆరోపణలు గుప్పిస్తూ ఎదురుదాడికి దిగిందన్నారు.  డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆందోళన దొంగేదొంగ అని అరిచినట్లుగా ఉందని వైసీపీ హయాంలో గ్రూప్ వన్ అవకతవకలపై కోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును ప్రస్తావించారు. వైసీపీ తీరు ప్రజలకు కూడా అర్థమైందని విక్రమ్ పోలా అన్నారు. 

విక్రమ్ పోలా ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ లో వీక్షించండి 

MegaDSC, NaraLokesh, NaraLokeshAPAssemblySpeech, APMegaDSCClarification, YCPvsTDPMegaDSC. AP Assembly Meetings

By
en-us Political News

  
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.