ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ పిల్ దాఖలు చేసినది వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. పర్వతరెడ్డి చంద్రభేఖరరెడ్డి దాఖలు చేసిన పిల్ లో ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయనీ, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ) చేత విచారణ జరిపించాలని కోరారు.
అయితే.. హైకోర్టు ఈ పిల్ విచారణకు నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు.. సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు విభేదించింది. మెగా డీఎస్సీ నియామకాలు, నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో వందలాది పిటిషన్లు దాఖలైన అంశాన్ని గుర్తు చేసిన హైకోర్టు.. ఆధారాలు లేకుండా నియామక ప్రక్రియ మొత్తాన్ని సవాల్ చేయడం తగదని విస్పష్టంగా పేర్కొంది.
Mega DSC AP, AP High Court DSC Verdict, YCP PIL Mega DSC, AP Teacher Recruitment News, Parvathareddy Chandrasekhar Reddy PIL
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mega-dsc-ap-36-228003.html
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.