రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి..!

Publish Date:Aug 5, 2026

Advertisement

 

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని  కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలు విన్న కోర్టు రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని రేపు గురువారం అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

రెండు రోజుల కస్టడీ విచారణలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై జరిగిన వేధింపులు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఇతర కీలక అంశాలపై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించను న్నారు. కేసుకు సంబంధిం చిన పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు డిజిటల్ ఆధారాలను సేకరించడంపైనా కూడా పోలీసులు దృష్టి సారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ఉపయోగించిన మొబైల్ ఫోన్ పోలీసులకు లభించకపోవడం దర్యాప్తులో కీలకంగా మారింది. 

ఆ ఫోన్ స్వాధీనం అయితే కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లు, సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా కేసులోని పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు. ముఖ్యంగా కస్టడీ విచారణలో మొబైల్ ఫోన్ ఆచూకీని రాబట్టడం, దానిని స్వాధీనం చేసుకోవడం, కేసుకు సంబంధించిన ఇతర సాక్ష్యాధారాలను సేకరించడంపై అత్తాపూర్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల విచారణ అనం తరం కేసులో మరిన్ని కీలక విషయాలు బయ టపడే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నారు.

Trainee IPS Uday Krishna Reddy, Police Investigation, Attapur Police, Cherlapalli Jail, CM Revanth Reddy
 

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.