కోమటిరెడ్డి కుమారుడు మృతి,పలు నేతల సంతాపం

Publish Date:Dec 20, 2011

Advertisement

మెదక్‌ : జిల్లాలోని పఠాన్‌చెరు మండలం కొల్లూరు వద్ద డివైడర్‌ను స్కోడా కారు ఢీకొట్టిన  ప్రమాదంలో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి మృతిచెందారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మృతిచెందారు. వీరు ముగ్గురూ సిబిఐటిలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. ప్రతీక్‌రెడ్డి సిబిఐటిలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కోమటిరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు. మిగిలిన ఇద్దరిని సుచిత్‌రెడ్డి, చంద్రారెడ్డిలుగా గుర్తించారు. గాయపడిన ఆరోహన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొడుకు మరణవార్త విన్న వెంటనే వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు. కోమటిరెడ్డి సోదరులు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గొర్రెలను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందారు. ప్రతీక్‌రెడ్డి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పుటిప్పుడే కోమటిరెడ్డి ఇంటికి కార్యకర్తలు, బంధువులు చేరుకుంటున్నారు. ప్రమాదానికి గురైన కారు కోమటిరెడ్డి బంధువు పోరెడ్డి నర్సింహరెడ్డికి చెందినదిగా గుర్తించారు.

కాగా మెదక్‌ జిల్లా, కొల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రతీక్‌రెడ్డి మరణం పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కోమటిరెడ్డిని ఫోనులో పరామర్శించారు. మంత్రులు జానారెడ్డి, ఆనం, డీకే అరుణ, వట్టి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, భిక్షమయ్యగౌడ్‌, మోత్కుపల్లి ప్రతీక్‌రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. మంత్రి జానారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, టి.కాంగ్రెస్ ఎంపీల తరఫున పొన్నం ప్రభాకర్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, మంత్రి పార్థసారథి, మిర్యాలగూడ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లు తమ సందేశాల్లో సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, పొన్నాల, ఉమామాధవరెడ్డి గంటా శ్రీనివాస్‌,, వీహెచ్‌, బొత్స, పొంగులేటి,విజయశాంతి, దిలీప్‌కుమార్‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరులు అనిల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులను హోం మంత్రి సబితారెడ్డి, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు బాలు నాయక్, ప్రతాప్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజేందర్, పిడమర్తి లింగయ్య, శ్రీశైలం గౌడ్‌లుపరామర్శించారు. ప్రతీక్ మరణంతో చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విషాదం అలముకుంది.

కాగా  రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా, బ్రాహ్మణవెల్లెంలలో జరుగుతాయి. కాసేపట్లో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.  
 

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.