దేశం నాయకుడి సంరక్షణలో భాను?
Publish Date:Mar 15, 2012
Advertisement
ఫ్యాక్షనిస్ట్ మద్దెల చెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భాను ఇటీవల కొంతకాలం క్రితం వరకు కృష్ణాజిల్లాకు చెందిన ఒక యువ తెలుగుదేశం నాయకుడి సంరక్షణలో ఉన్నట్లు తెలిసింది. భాను గతంలో విజయవాడలో కు సెటిల్మెంట్స్ చేశాడు. భానుకు షెల్టర్ ఇచ్చిన ఈ యువ నాయకుడు గతంలో పరిటాల రవి వద్ద ఉండేవాడు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెల చెర్వు సూరిని అతని అనుచరుడు భాను హత్య చేశాడు. హత్యానంతరం తెలుగుదేశం పార్టీ నేత ఇతనికి చాలా రోజులు ఆశ్రయం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా పార్టీ అధినాయకత్వానికి తెలియడంతో ఆ యువ నేతను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఈ విషయం బైటకు పొక్కితే పార్టీ పరువు పోతుందని అధినాయకత్వం భయపడింది. దీంతో భానును గత్యంతరం లేక వేరే షెల్టర్ వెతుక్కోవాల్సి వచ్చింది. పోలీస్ యంత్రాంగం చాలా కాలంగా భాను కోసం తీవ్రంగా గాలిస్తోంది. భాను నమ్మించి సూరిని హతమార్చాడు. ఈ హత్య వెనుక ఉన్న అనేక కారణాలతో పాటు ఒక టి.వి. న్యూస్ రీడర్ తో ఉన్న రిలేషన్స్ కూడా ఒక కారణమైనట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ రీడర్ మొదట భానుతో సన్నిహితంగా ఉండేది. అతని ద్వారా సూరికి పరిచయమైంది. సూరి ఈమెను తన జీవిత భాగస్వామి చేసుకోవాలని భావించడం భానుకు ఏ మాత్రం నచ్చలేదు. సూరిపై కక్ష పెంచుకోడానికి ఈ అంశం కూడా ఒక కారణమైందని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/maddelacheruvu-suri-murder-24-12669.html





