ప్రేమ పెళ్లి.. విషాదాంతం.. ఆరు నెలల పసిబిడ్డ అనాథ

Publish Date:Jun 29, 2026

Advertisement

 

గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా  ఆరు నెలల క్రితం ఓ పసిబిడ్డ జన్మించింది. అయితే ఏమైందో ఏమో.. ఆ ప్రేమజంట తీసుకున్న కఠిన నిర్ణయం ఆ చిన్నారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం, బలసాయి, పద్మ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు జన్వాడలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదు నెలల పసిబిడ్డ ఉంది. అయితే ఆదివారం తమ నివాసంలోనే బలసాయి, పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, దర్యాప్తు వివరాల ఆధారంగా పూర్తి సమాచారం వెలుగులోకి రానుంది.

ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ కోల్పోయి అనాథగా మారిన ఆరు నెలల పసిబిడ్డను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

By
en-us Political News

  
128 ఏళ్ల తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. ఈ మెగా ఈవెంట్‌కు భారత పురుషుల క్రికెట్ జట్టు ఎలా అర్హత సాధించాలో, ఐసీసీ విధించిన కఠినమైన నిబంధనలు మరియు అర్హత మార్గాల పూర్తి వివరాలు మీకోసం.
ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్, బీసీసీఐ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు మీకోసం.
సాక్షాత్తూ ఒక రాష్ట్ర గవర్నరే వైసీపీ తమ కుటుంబ భూమిని కబ్జా చేసిందంటూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయం నిర్మించారని ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి సమస్యా లేని, శాంతిభద్రతలకు నిలయంగా భావించే బెంగళూరు నగరంలో గంటల వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఐటీ నగరాన్ని వణికించేసింది.
సాధారణంగా ఏదైనా దొంగతనం లేదా అక్రమం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాతే రికవరీ ప్రక్రియ మొదలవుతుంది. కానీ అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కుంభకోణం కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే, ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి ఏకంగా 58 లక్షల నగదును రికవర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
వంట బాగాలేదంటూ తండ్రీ కొడుకులు శశాంక్సింగ్, శైలేష్ సింగ్ లు అతడిపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు.
వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కన్నబిడ్డల కుత్తుకలను కోసి హత్య చేసి.. ఈ తరువాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇరాన్ ఎదుర్కొంటున్న ఆంక్షల సడలింపు అంశం కూడా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండనుంది. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ ల మధ్య ప్రత్యక్ష క్షిపణి దాడులు జరిగినప్పటికీ, యుద్ధ వాతావరణాన్ని పక్కన పెట్టి దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల అగ్రనేతలు మొగ్గు చూపుతున్నారు.
సాధారణంగా భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కానీ తాజాగా హిమాచల్ లో వర్షాలు లేకుండానే మంచు కరిగి వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా ఝల్మా వాగులో నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరి, అక్కడి రహదారిని ముంచెత్తింది.
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.