స్టాలిన్ కు లోకేష్ షాక్ !

Publish Date:Mar 12, 2025

Advertisement

ప్రాంతీయ, భాష వాదాలను రెచ్చగొట్టి, దక్షణాది రాష్ట్రాలపై తమిళ ఆధిపత్యాన్నిరుద్దేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కుగట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి మాతృ భాష ను రాజకీయం చేయడం పట్ల  ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  తనదైన స్టైల్లో  స్పందించారు.  స్టాలిన్ పేరు నేరుగా ప్రస్తావించ కుండానే మంత్రి లోకేష్,  మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని  సున్నితంగా చురకలు అంటించారు. ఎవరి మాతృ భాషను వారు కాపాడుకోవాలి  కానీ మీరు  భాషను రాజకీయం చేయడం తగదు అని కుండ బద్దలు కొట్టారు.   అయినా కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం లో ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి లోకేష్  సూటిగా  ప్రశ్నించారు. 

నిజానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో ఎక్కడా కూడా, డిఎంకే ఆరోపిస్తున్నట్లుగా హిందీని మూడవ భాషగా అమలుచేసి తీరాలనే నిబంధన లేదు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో, ఒక్క తమిళనాడు అని మాత్రమే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిందీని మాత్రమే మూడవ భాషగా రుద్దే ప్రయత్నం కానీ ప్రతిపాదన కానీ లేదు. మాతృ భాష  ఇంగ్లీష్ తో పాటుగా మరో భారతీయ భారతీయ భాష బోధించాలని మాత్రమే  జాతీయ విద్యా విధానం  ముసాయిదాలో పేర్కొన్నారు. నిజానికి స్టాలిన్ కు ఈ విషయం తెలియదని కాదు. తెలుసు, అందుకే  ముందు ఓకే చెప్పి ఇప్పడు రాజకీయ అవసరాల కోసం లేని అంశాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని  అంటున్నారు.  

అందుకే తమిళ నాడు శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు  ప్రజలను రెచ్చ గొట్టేందుకు  డిఎంకె  చేస్తున్న అనేక ప్రయత్నాలో ఇది మరొక  ప్రయత్నంగానే  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  అధికార డిఎంకె ఇంత వరకు చరిత్రలో ఎప్పుడూ వరసగా రెండవ సారి విజయం సాధించలేదు. ఈ సారి కూడా అదే జరుగుతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఏదో విధంగా అధికారాన్ని నిలుపుకునేందుకు అనవసర వివాదాలు సృష్టిస్తోందని  విమర్శకులు అంటున్నారు. 

ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో  తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారి పోతున్నాయి. మరో వంక, తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించిన విజయన్ , ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్నా డిఎంకె,  ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.ఇంతవరకు, కూటమికి స్పష్టమైన రూపం రాక పోయినా, సరైన సమయంలో కూటమి ఏర్పడుతుందనే విశ్వాసం ప్రతిపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు.   మరో వంక స్టాలిన్ ప్రభుత్వం పై  అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతోంది. ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అందుకే   ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రాంతీయ వాదాన్ని, భాషా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే  ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకె నేతలు తమ ప్రభుత్వ  వైఫల్యాలకు, సెంటిమెంట్  ముసుగు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ భాషను ఒక భూతంగా, చూపించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి   దక్షిణాది రాష్ట్రాల జాతీయ నేతగా  ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు స్టాలిన్ కేంద్రం పై కాలు దువ్వడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అయితే  రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంతో పాటుగా  దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ సూపర్ స్టార్ గా తనను ఫోకస్ చేసుకునేందుకు స్టాలిన్ చేస్తున్నప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది.

విషయం గ్రహించే  దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్టాలిన్ ప్రకటనలపై ఆచితూచి స్పదిస్తున్నాయి. అయితే  డిఎంకె మాత్రం పార్లమెంట్ లోపలా వెలుపల కూడా, తమిళనాడులో’ అధికారం నిలుపుకోవడంతో  పాటుగా  దక్షిణాది రాష్ట్రాలపై తమిళ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే  లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. తమిళ పప్పులు తెలుగు నాట ఉడకవని  స్టాలిన్ కు షాక్ ఇచ్చారు.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.