Publish Date:Apr 25, 2022
అవును, నిజమే. ఒమిక్రాన్‌ను అడ్డుకోవడంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. కొవిషీల్డ్ తీసుకున్న పలువురిపై జరిపిన పరిశోధనల్లో ఆ విషయం వెల్లడైంది. ఆ పరిశీలనలు చేసింది కూడా పుణేలోని ప్రఖ్యాత భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్ కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-ఎన్‌ఐవీ. దీంతో.. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారంతా ఈ వార్తతో అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, బూస్టర్ డోస్ తప్పనిసరి అంటున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త (38) టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి.. కొవిషీల్డ్ తీసుకున్న తర్వాత రెండుసార్లు కరోనా బారినపడ్డాడని ఎన్ఐవీ శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకోగలదని ఈ అధ్యయనంతో నిరూపితమైందని అంటున్నారు. కొవిడ్ టీకా బూస్టర్ డోసును తీసుకోవడం అత్యవసరం అనేందుకు ఇదొక సంకేతమని చెబుతున్నారు.
పరిశోధకుల కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలిసారిగా 2020 అక్టోబరు 9న కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏడాది తర్వాత (2021 నవంబరులో) అతడిలో మళ్లీ కొవిడ్ లక్షణాలు కనిపించగా.. పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కరోనా సోకింది. ఇటీవల 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు తేలింది. టీకా తీసుకున్నా ఇలా వరుసగా కరోనా బారిన పడటం కలకలం రేపింది.
ఆ ఆరోగ్య కార్యకర్త కొవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డోసును మార్చి 3న తీసుకున్నాడు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్‌పై మెరుగైన రోగ నిరోధక స్పందనను కలిగిస్తున్నందున.. కొవిషీల్డ్ తీసుకున్న వారు మూడో డోస్ తీసుకొని.. తగినంత రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఈమేరకు ఆ అధ్యయన నివేదిక ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో పబ్లిష్ అయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/less-effect-of-covishield-on-omicron-39-134930.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!