ఎల్‌బీ నగర్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Jun 18, 2026

Advertisement

 

ఎల్‌బీ నగర్ ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది...

ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో కొడంగల్‌లో రాజకీయ కుట్రల కారణంగా ఓడిపోయిన సమయంలో చాలా మంది తన రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలిచి మల్కాజ్‌గిరి ఎంపీగా అవకాశం కల్పించారని చెప్పారు.

మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్‌బీ నగర్ ప్రజలు 30 వేల మెజారిటీ ఇచ్చి తనను గెలిపించారని, ప్రజల తరఫున పార్లమెంట్‌లో గట్టిగా పోరాడినందుకే పార్టీ తనకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిందన్నారు. పీసీసీ చీఫ్‌గా మూడేళ్లు పోరాడి ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, గుర్రంగూడా ప్రాంతాలు గతంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇప్పుడు వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం పేర్కొన్నారు. రూ.2,400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నామని వెల్లడించారు.

గుర్రంగూడా ఎకో పార్క్ భూములను ప్రైవేట్ లేఅవుట్లుగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందని, సుప్రీంకోర్టులో కేసు గెలిచి 424 ఎకరాలను నేషనల్ పార్క్‌గా ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. చెరువులు, నాలాల ఆక్రమణల వల్ల కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

హైడ్రా (HYDRAA)పై జరుగుతున్న విమర్శలను ప్రస్తావిస్తూ, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారి జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. చెరువులు, పార్కులు, నాలాలను ఆక్రమించిన వారిపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొద్ది మంది ఆక్రమణదారుల వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, చెరువుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని గుర్తు చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. 30 వేల ఎకరాల్లో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టులో 15 వేల ఎకరాలను అటవీ అభివృద్ధికి కేటాయిస్తున్నామని, 60 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి భవిష్యత్ తరాలు గర్వించేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మూసీ ప్రక్షాళనను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ అభివృద్ధి చేపడతామని వెల్లడించారు.

By
en-us Political News

  
కోల్ కత్తాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ...
అమెరికా B1/B2 వీసా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూసే భారతీయులకు అలర్ట్. జూలై 1 నుండి రానున్న సరికొత్త ఫాస్ట్ ట్రాక్ పైలట్ ప్రోగ్రామ్, ఫీజుల వివరాలు మరియు నియమ నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి.
నాసాకు చెందిన $500 మిలియన్ల స్విఫ్ట్ ఉపగ్రహం భూకక్ష్య నుండి వేగంగా పడిపోతోంది. దానిని రక్షించడానికి కాటలిస్ట్ స్టార్టప్ కేవలం 10 నెలల్లో రూపొందించిన వినూత్న రోబోటిక్ రెస్క్యూ మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద రూ. 30,000 కోట్ల NSE IPO ముసాయిదా పత్రాలు దాఖలు ధర, ఎంట్రీ డేట్, లాభాల వివరాలు మరియు పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
8వ వేతన సంఘం (8th Pay Commission) పరిధిలో రైల్వే ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక అప్‌డేట్. ఐఆర్‌టీఎస్‌ఏ (IRTSA) డిమాండ్ చేసిన 2.92, 3.50, మరియు 3.80 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల ప్రకారం లెవెల్ 1 నుండి లెవెల్ 18 వరకు బేసిక్ శాలరీ ఎంత పెరుగుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
2027 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో తేల్చేసిన సునీల్ గవాస్కర్. అఫ్గానిస్తాన్‌పై 79 బంతుల్లో 125 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌పై ప్రశంసలు.
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే బేర్ నకిల్ ఫైటింగ్ రింగ్ లోకి వచ్చి తేల్చుకోవాలని, మలయాళీలు, సర్దార్ల గౌరవార్థం రావాలంటూ చేసిన వ్యాఖ్యల వైరల్ వీడియో వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 లో ఇరాక్‌పై నార్వే 4 1 తేడాతో గెలిచినందుకు ఆ దేశ పార్లమెంట్ సభ్యులు రాజకీయాలు పక్కనబెట్టి వైకింగ్ రోయింగ్ సెలబ్రేషన్స్ చేశారు. చట్టసభను ఊపేసిన ఆ క్రేజీ వైరల్ వీడియో విశేషాలు ఇక్కడ చూడండి.
ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారులకు భారీ అప్‌డేట్. ఈ నెలాఖరు నుండి యూపీఐ, ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సరికొత్త సౌకర్యం రాబోతోంది. దీనితో పాటు 8.25 శాతం వడ్డీ జమ కానుంది. సర్వర్ బ్లాక్‌అవుట్ వివరాలు ఇక్కడ చూడండి.
టర్టిల్ మింట్ (Turtlemint) ఐపీఓ జూన్ 19న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. షేరు ధర144 152, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం GMP , బ్రోకరేజ్ సంస్థల రివ్యూలు, కంపెనీ ఆర్థిక నివేదికలు మరియు మీరు పెట్టుబడి పెట్టాలా వద్దా అనే పూర్తి విశ్లేషణను ఇక్కడ చదవండి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం పర్యటన నేపథ్యంలో నేడు సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ రూట్లలో ప్రయాణించే వారు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు మరియు రూట్ మ్యాప్ వివరాలు తప్పక తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.