Publish Date:Jun 19, 2026
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది.
గతంలో తన మొబైల్ ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ చికోటి ప్రవీణ్ అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను అప్పటి ఎస్‌ఐబీ అధికారి రాధాకిషన్ రావు అక్రమంగా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదును ఎస్‌ఐటీ అధికారులు దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తుండగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను గుర్తించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన పరిస్థితులు, దాని వల్ల ఎదురైన ఇబ్బందులు, అలాగే అప్పట్లో సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసుకునేందుకు చికోటి ప్రవీణ్‌ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, అవసరమైతే సంబంధిత ఆధారాలు, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక వివరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎస్‌ఐటీ విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, బాధితులు, సాక్షులను విచారించిన దర్యాప్తు బృందం కేసులోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. చికోటి ప్రవీణ్ విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఎస్‌ఐటీ నుంచి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-notices-to-chikoti-praveen-in-phone-tapping-case-36-223481.html
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!