పారిశ్రామికవేత్తలతో లోకేష్ కీలక భేటీ...ఏపీ అభివృద్ధికి సహకరించండి

Publish Date:Jun 19, 2026

Advertisement

 

కోల్ కత్తాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ...

వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్,  సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను మంత్రి ప్రశంసించారు.

 ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును వివరించారు. తూర్పు తీర ప్రాంతంలో కీలక ఆర్థిక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న పాత్రను ప్రస్తావించారు. విస్తారమైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగుపడుతున్న లాజిస్టిక్స్, భూమి, విద్యుత్ లభ్యత, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు ఏపీలో సానుకూల అంశాలుగా పేర్కొన్నారు.

భారతదేశంలో ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా మంత్రి లోకేష్ చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటైన 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్' ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిద్వారా రాష్ట్రం ఉక్కు పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని చెప్పారు. 

ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు జాతీయ ఆర్థిక ధోరణులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ పోటీతత్వం, పరిశ్రమ-ప్రభుత్వ సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పెట్టుబడులను సులభతరం చేయడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని వారు అభినందించారు.  రాష్ట్రాభివృద్ధిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.
 

By
en-us Political News

  
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.