వై.ఎస్‌. ఆనవాళ్ళను కాంగ్రెస్‌ చెరిపేయగలదా?

Publish Date:Jul 17, 2012

Advertisement

దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కన్నా వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఇమేజ్‌ ప్రజల్లో నాటుకు పోయింది. ఏ సంక్షేమ పథకం ఆయన ప్రకటించినా అది కాంగ్రెస్‌ పార్టీ రూపొందించినది కాదని, వైఎస్‌ సొంతంగా ఈ పథకాన్ని రూపొందించారని ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కన్నా వైఎస్‌కు ప్రజల్లో సంక్షేమపథకాల నిర్మాతగా ముద్రపడిరది. ఆ ముద్ర ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి లాభిస్తోంది. వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని వై.కా.పా. అధ్యక్షుడు జగన్‌ పలుమార్లు డిమాండు చేశారు. దీంతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో అమలు చేసే ఏ సంక్షేమ పథకమైనా రాష్ట్రంలో మాత్రం వైఎస్‌ ముద్రను సొంతం చేసుకున్నాయి. ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని మంత్రివర్గకమిటీ కూడా ఈ విషయాన్ని గమనించింది.

 

జగన్‌ తొలిసారి ఈ ముద్రను వేసినప్పుడే తిప్పికొట్టి ఉంటే బాగుండేదని, ఇప్పుడు ప్రజలకు దీని గురించి వివరించటం చాలా కష్టమని కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన సంక్షేమ పథకం ఇది అని వివరిస్తూ వైఎస్‌ కూడా తనలాగే ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి దాన్ని అమలు చేశారని విశదీకరిస్తున్నారు. ఇంత సుదీర్ఘ విశదీకరణ అన్ని ప్రాంతాల్లోనూ ఆయన చెప్పగలరా? ఆ ముద్రను చెరపటం అంత సులభమా?

 

ముద్ర చెరపటమే అంత సులభమైతే ఉప ఎన్నికల్లో ఓటమి తప్పేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అలానే వైఎస్‌ హయాంలో ఆగిపోయిన సగం ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయటం ద్వారా అది తమ పార్టీ రూపొందించినది అని తెలియజేయాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే లబ్దిదారులకు మళ్లీ మంజూరులు చేయటం ద్వారా కూడా కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ కార్యక్రమమన్న అభిప్రాయాన్ని కల్పించాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు. ఏమైనా వైఎస్‌ ముద్ర మాత్రం కాంగ్రెస్‌ను భయపెడుతోంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.