ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై దాడి చేసిన లేడీ బౌన్సర్
Publish Date:May 7, 2026
Advertisement
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది... ఒక యువకుడుపై దాడి చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ సృష్టించింది. దీంతో బాధితుడు ఆన్లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన హైదరాబాద్-- పంజాబ్ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ కాపర్తి (22) అనే నేను ఎల్.ఎల్.బి చదువుతున్నాను... నిన్న క్రికెట్ చూడ్డానికి ఉప్పల్ స్టేడియం వెళ్ళాను. సుమారు రాత్రి 8: 45 గంటల ప్రాంతంలో స్టేడియం లోపల బార్ కౌంటర్ వద్ద కూర్చొని ఉన్న సమయంలో ఓ మహిళా బౌన్సర్ తన వద్దకు వచ్చి హల్ చల్ సృష్టించింది. దీంతో నేను (గౌతం) మొదటగా ఆశ్చర్యపోయాను. అనంతరం మొబైల్ ఫోన్ తీసుకొని ఆమె ప్రవర్తనను వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించాను. అది గమనించిన లేడీ బౌన్సర్ వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఆగ్రహంతో తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తన చేతిలో ఉన్న ఫోన్‌ను బలవంతంగా లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయిందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయని, ఫోన్ పోగొట్టుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నానని గౌతం తెలిపాడు. ఈ ఘటనపై దొంగతనం కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత మహిళ బౌన్సర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ గౌతమ్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన సాక్ష్యా లను కూడా పంపించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.
http://www.teluguone.com/news/content/lady-bouncer-attacks-young-man-at-uppal-stadium-36-219168.html





