రూ.3.50 లక్షల లంచం...ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Publish Date:May 7, 2026

Advertisement

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు. ప్రభుత్వ అధికారుల అవినీతి వ్యవహారాలపై కొనసా గుతున్న తనిఖీల్లో భాగంగా, అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు భారీ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీ అంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతపురి సుజాత అనే మహిళ భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) గా పనిచేస్తుంది.  అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO) మరియు చర్ల ఇన్‌చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భూక్య కృష్ణ పనిచేస్తున్నారు. 

అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం పుష్పుగుప్ప గ్రామం నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు 2025లో నిర్మాణం చేపట్టిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనుల సందర్భంగా, కొన్ని చెట్లను నరికి వేయడం జరిగింది... దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ని బాధితుడు అటవీ శాఖ అధికారులను కలిశాడు. అయితే బీటీ రోడ్డు పనుల సందర్భంగా, కొన్ని చెట్లకు నష్టం జరిగిందన్న ఆరోపణలపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు, అలాగే భవిష్యత్తులో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని చెప్పి ఈ ఇద్దరు అధికారులు ఫిర్యాదిదారుడిని లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

మొదట గా రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసిన అధికారులు, తర్వాత ఫిర్యాదు దారుడి అభ్యర్థనతో మొత్తం మొత్తాన్ని రూ.3.50 లక్ష లకు తగ్గించారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఏసిబి అధికా రులు వలపన్ని ఈరోజు ఇద్దరు అధికారులు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం,ఈ ఇద్దరు అధికారుల నుండి లంచం డబ్బును స్వాధీనం చేసుకుని... నిందితులను అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 

ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసా గుతోంది. నిందితులు తమ అధికారిక పదవులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లాభం పొందే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు  వెల్ల డించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదిదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్(9440446106), సోషల్ మీడియా వేదికలు మరియు ఏసీబీ QR కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు .
 

 

By
en-us Political News

  
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బులియన్ మార్కెట్లో బంగారం వెండి నిష్పత్తి 69 కి చేరింది. 2026 లో 80 మార్కు దాటిన ఈ రేషియో ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో ఏ లోహంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి భవిష్యత్ పెట్టుబడులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంగారం, ఆయిల్ కంటే నీటి హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.
అమెరికాలో ఓటింగ్ విధానాన్ని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act 2026 బిల్లు విశేషాలు, పౌరసత్వ నిరూపణ నిబంధనలు మరియు దీనివల్ల ఓటర్లపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? జూలై 19న లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్‌లో చివరిదా? అసలు నిజమేంటో ఇక్కడ చదవండి.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌ను ప్రశ్నిస్తూ, వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు స్మృతి మందానను కెప్టెన్ చేయాలని సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ అంబేద్కర్ విద్యాసంస్థల లెక్చరర్, పవర్ లిఫ్టర్ మారుపాక శ్రేణిక్ సౌతాఫ్రికాలో జరిగిన ఆసియా ఆఫ్రికన్ పసిఫిక్ ఛాంపియన్‌షిప్‌లో 565 కేజీల బరువు ఎత్తి అద్భుతమైన రజత పతకం సాధించారు. శ్రేణిక్ విజయ ప్రస్థానం మరియు భావోద్వేగ కథనం ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.