ఈడీ సోదాలు ... నోట్ల కట్టల బ్యాగుల కలకలం!

Publish Date:May 7, 2026

Advertisement

 

మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.  అక్కడి వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం(7-5-26న) సోదాలు నిర్వహించారు. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణల కేసుల్లో భాగంగా ఈడీ దాడులు చేసింది. 

కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్స్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్‌స్ట్రక్షన్స్ సహా అనుబంధ సంస్థలకు చెందిన ఆఫీసులపై దాడులు చేశారు. మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. 

నేలపై నోట్ల కట్టలు పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నగదుకు భూ కుంభకోణం కేసుతో సంబంధం ఉందా, లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు నగదు సంచులు దొరికినట్లు ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆ వీడియోలను ఎస్ఏడీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈడీ దాడుల సందర్భంగా నగదును ఇలా పడేశారంటూ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
 

 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.