వివేకా గుండెపోటు 'కథ' వెనక 'ఆమె'..?

Publish Date:Feb 25, 2022

Advertisement

మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. చిక్కు ముడులు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ హత్య కేసులో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. వివేకా హత్య కేసులో తొలుత ఆయనది గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. గుండెపోటు కథ నుంచి.. గొడ్డలి పోటుతో దారుణ హత్య అనే విషయం ప్రపంచానికి తెలిసే వరకు.. అంతా ఆమెనే కథ నడిచినట్లు కడప జిల్లాలో ఆఫ్ ది రికార్డ్ చర్చ జరుగుతోంది. వివేకా మర్డర్ జరిగిన వెంటనే.. స్థానిక ఎంపీ.. ఆమెకు ఫోన్ చేయడం.. ఆమె వెంటనే స్పందించడం.. ఆమె ఆదేశానుసారంతోనే.. గొడ్డలి పోటు కాస్తా.. గుండెపోటుగా మారిందని... అలాగే ఆమె కనుసన్నల్లో వివేకా హత్య కేసులో సాక్ష్యాలు సైతం తారుమారు అయ్యాయని.. ఇవన్నీ కూడా అటు ఆమె ఫోన్‌లోనే ఆదేశాలు ఇవ్వడం.. ఇటు చక చకా జరిగిపోవడం.. అంతా సెకన్లలో జరిగిపోయిందనే టాక్ అయితే కడప గడప సాక్షిగా వైరల్ అవుతోంది. అంతేకాదు... ఈ హత్య కేసులో కర్మ , కర్త, క్రియా అన్ని ఆమెనని తెలుస్తోంది. అసలీ జగన్నాటకంలో జగన్నాటాక సూత్రధారి అంతా ఆమెదేననే టాక్ అయితే జోరుగా నడుస్తోంది.  

ఈ సూత్రధారిణి మంత్రాంగంలో పాత్రధారులు స్థానిక ఎంపీతోపాటు..పలువురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే చర్చ కూడా కడప జిల్లా సాక్షిగా సాగుతోంది. అంతేకాదు.. వివేక హత్యతో ఆయన ఎపిసోడ్ పూర్తయిందని ఓ క్లారిటీకి వచ్చిన తర్వాతే.. ఆమె.. ఓ ఎలక్ట్రానికి మీడియా సంస్థలోని సంపాదకీయ వర్గానికి నేరుగా ఫొన్ చేసి.. వైయస్ వివేకా గుండె పోటుతో మరణించారంటూ వార్తలు ప్రసారం చేయాలని ఆదేశించినట్లు చర్చ అయితే కడపలో నడుస్తోంది. 

అంతేకాదు అసలు ఆమె ప్రోద్భలంతోనే వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందా? అంటూ కడప జిల్లా వాసులు సైతం  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ హత్యకు స్కెచ్ వేసిందీ కూడా ఆమెనా? అనే సందేహాలు సైతం వెలువడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటూ ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

2019, మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కానీ ఆయన గుండె పోటుతో మరణించారంటూ.. ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత వైయస్ వివేకాది ఆకస్మిక మృతి కాదు.. దారుణ హత్య అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోండంతో.. వైయస్ వివేకా కుమార్తె సునీత.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ హత్య కేసును సీబీఐకు హైకోర్టు  అప్పగించింది. 

ఈ నేపథ్యంలో ఈ కేసులో అసలు దోషులు ఎవరో సాధ్యమైనంత త్వరగా తేలిపోతారంటూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ హత్య కేసులో దర్యాప్తులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకానొక సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ఆపివేసిందనే చర్చ కూడా సోషల్ మీడియా సాక్షిగా నడిచింది. కానీ ఆ తర్వాత మళ్లీ.. సీబీఐ.. తన దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే ఈ హత్య కేసులో వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి.. అప్రూవర్‌గా మారి.. సీబీఐ ఎదుట పూసగుచ్చినట్లు చెప్పేసిన సంగతి తెలిసిందే.

కానీ అసలు ఈ హత్య కేసులో ఆమెది కీలక పాత్ర అంటూ తాజాగా చర్చకు రావడంతో ఇంతకు ఆమె ఎవరంటూ కడప జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేస్తేనే... అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం వైయస్ఆర్ కడప జిల్లా సాక్షిగా వైరల్ అవుతోంది. ఇంతకీ అంతా అనుకుంటున్నట్టు.. ఆమె ఆమేనా?

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.