డిజిటల్ సీఎం నుంచి రైతు బాంధవుడి వరకూ: నారా చంద్రబాబు ప్రస్ధానం.!

Publish Date:Sep 26, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ మ్యాప్‌లో నిలబెట్టిన నాయకుడిగా, దార్శనికుడిగా చంద్రబాబుకు తిరుగులేనిగుర్తింపు ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను టెక్నాలజీ పట్ల మక్కువ గల నేతగా అభివర్ణిస్తుంటారు.

ఆయన దార్శనికతను అభినందిస్తారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తప్ప మరేమీ మిగలని ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించారు. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత పలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికలలో విజయం తరువాత.. చంద్రబాబు పని తీరులో సమూల మార్పు వచ్చింది. పరిశీలకులు ఆయన ప్రస్తుత పాలనను చంద్రబాబు  2.0 అంటున్నారు. ఏకకాలంలో టెక్నాలజీకి,  వ్యవసాయానికీ, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 

వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా అన్నదాతలు తమ పంటల సాగుకు సంబంధించి శాస్త్రీయంగా  ముందస్తు ప్రణాళిక చేసుకునే అవకాశం లభిస్తుంది.  

ఈ ప్రణాళికలో  ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు  ప్రాధాన్యత ఇచ్చారు. హంద్రీ నీవా సుజల స్రవంతి,  వెలిగొండ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల దాదాపు 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా, కృష్ణా-గోదావరి బేసిన్ పరిధిలో కాల్వల ఆధునీకరణ, నదుల అనుసంధాన పనులను కూడా వేగవంతం  చేశారు. రైతులు  లాభాలు గడించేందుకు వీలుగా రాయితీపై మైక్రో ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.

వర్షపాతం నమోదు, జలాశయాల నీటి మట్టాలు, నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా   ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. 

గతంలో  వైసీపీ  చంద్రబాబుపై వేసిన వ్యవసాయ వ్యతిరేకి  అనే  ముద్రను  చంద్రబాబు తన నిర్ణయాల ద్వారా పూర్తిగా చెరిపేశారు. టెక్నాలజీతో పాటు వ్యవసాయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఆయన తన కార్పొరేట్ ఇమేజ్‌ ను అలాగే కాపాడుకుంటూ.. అచ్చమైన  రైతు నేతగా ట్రాన్స్ ఫారమ్ అయ్యారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు సైతం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ  నిర్ణయాలను ప్రముఖంగా ప్రశంసిస్తున్నాయి. 

[Chandrababu Naidu, Digital CM, Transform, Farmer Friend,  Andhra Pradesh agriculture, irrigation projects, Rayalaseema irrigation, AP news, Telugu One]

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.