దేశంలో 40 శాతం లోటు.. లడక్ లో మాత్రం 96శాతం అధిక వర్ష పాతం!

Publish Date:Jun 17, 2026

Advertisement

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. జూన్ నెలలో వానలు ముఖం చాటేశాయి. ఈ నెల 17 వరకూ అంటే బుధవారం వరకూ దేశ వ్యాప్తంగా సగటు వర్ష పాతం కంటే 40శాతం లోటు వర్షపాతం నమోదైంది. పంటల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశంలోని పలు ప్రాంతాలలో కరవు చ్ఛాయలు కనిపించే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతోంది. జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి.  సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా   65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.

దేశ వ్యాప్తంగా వాతావరణం ఇలా నెలకొని ఉంటే..  హిమాలయాల ఒడిలో ఉండే చల్లటి ఎడారి   లడఖ్ లో మాత్రం   పూర్తి భిన్నమైన వాతావరం నెలకొంది.  ఎప్పుడూ పొడిగా ఉండే లడఖ్ ప్రాంతంలో  అనూహ్యంగా భారీ వర్షాలు కురిశాయి.   వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం జూన్ 17 నాటికి లడఖ్‌లో సాధారణంగా కేవలం 2.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురవాల్సి ఉంది. కానీ ఈ సారి అక్కడ   4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా కురిసే వర్షపాతం కంటే 96 శాతం ఎక్కువ.  

మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్,  ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో   వర్షపాతం లోటు 60 శాతం నుండి  100 శాతం వరకు నమోదైంది. అందుకు భిన్నంగా  లడఖ్‌లో  96శాతం అదనపు వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులనే విస్మయ పరుస్తోంది.  ఈ విచిత్రమైన వాతావరణ మార్పులకు   వాతావరణ నిపుణులు  ఉత్తర భారతదేశం మీదుగా కదిలిన పశ్చిమ అలజడులు,  వాటి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన తీవ్రమైన తేమ కారణంగా లడఖ్‌లో ఈ స్థాయి వర్షాలు కురవడానికి కారణంగా చెబుతున్నారు.

హిమాలయ పర్వత ప్రాంతాలలో వేగంగా మారుతున్న  వాతావరణ ధోరణుల పట్ల  పర్యావరణవేత్తలు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.  కేవలం మంచు మాత్రమే కురిసే హిమాలయ ప్రాంతాల్లో ఇప్పుడు తరచూ వర్షాలు పడటం గ్లోబల్ వార్మింగ్ సంకేతంగా వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ మార్పులు  భవిష్యత్తులో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం  వంటి పర్యావరణ విపత్తుల ముప్పునకు సంకేతమని అంటున్నారు.   

By
en-us Political News

  
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్గత రోడ్లు నిర్మాణ పరిస్థితిపై... టోన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు..
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన వాసుదేవ రెడ్డి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో కస్టడీ విచారణ ముమ్మరం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.