బిగ్ బికి ఏమైంది?.. సర్వత్రా ఆందోళన, ఉత్కంఠ.. ఎందుకంటే?

Publish Date:Jul 21, 2026

Advertisement

బిగ్ బి,  బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్  ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమ వేదికగా అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఒక  పోస్టు  ఇందుకు కారణం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్..    తన ఆరోగ్యం,  ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది.   ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో   వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.  శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడం వరకు జరిగిన ప్రయాణాన్ని వివరిస్తూ, కోలుకునే ప్రక్రియ మానసికంగా, శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నదన్నారు. 

శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓటమి భావన ముంచెత్తుతుందని,  ధైర్యంగా పోరాటం సాగించేవారే   విజేతలుగా నిలుస్తారని అమితాబ్ పేర్కొన్నారు.  దీంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందోనన్న ఆందోళన అందరిలోనూ మొదలైంది.  ద గేమ్ హాస్ ఎండెడ్! బట్ ద వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ (ఆట ముగిసింది, కానీ పని ఇంకా కొనసాగుతోంది) అంటూ ఆయన ఆ పోస్టులో పేర్కొనడంతో..   బిగ్ బీకి ఏమైంది? ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 83 ఏళ్ల  అమితాబ్ బచ్చన్, గతంలోనూ పలు తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొన్నారు.  కూలీ సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన ఘోర ప్రమాదం మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఆయన  మనోధైర్యంతో బయటపడ్డారు. ప్రతిసారీ నూతన ఉత్సాహంతో కెమెరా ముందుకు వచ్చి  నట  విశ్వరూపాన్ని ప్రదర్శించి అభిమానులను అలరించారు.  ఈ నేపథ్యంలో అమితాబ్ తాజా పోస్ట్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఆందోళన రేపింది.

అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట  ఆయన త్వరగా పూర్తి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో ఎదుర్కొన్న శస్త్రచికిత్సల అనుభవాలను ఆయన గుర్తుచేసుకుంటున్నారా లేదా ఇటీవలమళ్లీ అనారోగ్యానికి గురయ్యారా? అన్నదానిపై నెట్టింట రకరకాల విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య సమస్య తలెత్తిందా అన్న విషయమై నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అమితాబ్   ఆరోగ్యానికి సంబంధించిన అఫీషియల్ గా తాజా అప్ డేట్ కోసం అమితాబ్ అభిమానులు, సినీ, రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. 

Big B Tweet Viral,  Amitabh Hospital Surgery, Amitabh Bachchan Blog Post, Telugu One 

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.