ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం..!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు, విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 

మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయూ సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. 

క్వాంటం స్పీడ్ తో అవకాశాలు అందుకోండి..

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులు సాగు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. 

రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు. రూ. 1 లక్ష కోట్ల ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో అక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని సీఎం యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టాలో నిరంతర నీటి సరఫరా కారణంగా వ్యవసాయ ఉత్పత్తి సాధించగలుగుతున్నామని తెలిపారు. 

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి ఓ విధానంగా మారిపోయిందని తెలిపారు. ప్రగతిశీల విధానాల వల్ల దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయన్నారు. పోర్టులు, రైల్వై, రోడ్డు వ్యవస్థతో ఏపీ లాజిస్టిక్స్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆగస్టు 1 తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలో అందుబాటులోకి వస్తోందని వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో విస్తృత వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి యూఏఈ బృందానికి తెలిపారు. క్వాంటం స్పీడ్ తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని యూఏఈ ప్రతినిధులను సీఎం కోరారు. 

ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్..

కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భారత్- యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు.

 ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించటం సంతోషదాయకమని ఆయన ప్రశంసించారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకూ కు డెయిరీ, పౌల్ట్రీ, సీఫుడ్ , పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామని అన్నారు. 

కృష్ణపట్నం, కాకినాడ నుంచి యూఏఈకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని యూఏఈ మంత్రి తెలిపారు. ఏపీ-యూఏఈల మధ్య బంధం మరింత వేగంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ స్పష్టం చేశారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో యూఏఈకి ఫుడ్ క్లస్టర్ చైర్మన్ సలేహ్, యూఏఈ సహాయ కార్యదర్శి మారియా అల్ ఖాసిమ్, స్పెషల్ ప్రాజెక్ట్స్  డైరెక్టర్ అనూషా అల్ మర్జూఖీ, యూఏఈ ఎంబసీ నుంచి అహ్మద్ అల్ జ్నేబీ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్ , పరిశ్రమలు, ఈడీబీ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


 

By
en-us Political News

  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.