సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే లీగల్ నోటీసు పంపిస్తా : కేటీఆర్

Publish Date:Jul 23, 2026

Advertisement

 

వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబ్ ఏరినా సంస్థ తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్)కు సంబంధించి లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు. ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్లోబ్ ఏరినా నిజంగానే తన బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించిన కేటీఆర్... మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది తన బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడం లేదని విమర్శించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనని అన్నారు.

ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం సహా ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో ఉంటారని, "కాంగ్రెస్‌కు ఒక మూట... బీజేపీకి రెండు మూటలు... ఇదే రేవంత్ రెడ్డి పాలన" అని వ్యాఖ్యానించారు. తాను సీఐడీ విచారణకు సిద్ధమని, రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంపై సిట్ లేదా సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి సిద్ధమా అని ప్రశ్నించారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

KTR, Warangal, Media Chit-Chat, Globe Arena,  Defamation Notice, Legal Notice, Binami Allegations, CM Revanth Reddy, Congress Government, BJP, PM Narendra Modi, Raj Bhavan Protest


 

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.