కేజీ బేసిన్ గ్యాస్, చమురుతో ఆంధ్రాకు ఒరిగిందేమిటి?
Publish Date:Feb 13, 2012
Advertisement
కృష్ణా జిల్లా: కృష్ణ, గోదావరి (కేజీ) బేసిన్ లో అపారంగా గ్యాస్, చమురు నిక్షేపాలు లభిస్తున్నాయి. ఈ విషయాన్ని ఓఎన్జిసి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎ.ఎ. ఖాన్ అంగీకరించారు. ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల్లో ఇప్పటి వరకు 400 వెల్స్ ను గుర్తించి డ్రిల్లింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. కేజీ బేసిన్ లో ఎక్కడైనా ఐదుచోట్ల డ్రిల్లింగ్ చేస్తే రెండునుంచి మూడుచోట్ల గ్యాస్, చమురు నిక్షేపాలు కనిపిస్తున్నాయని ఆయన ఆనందంగా చెప్పారు. కేజీ బేసిన్ ద్వారా ఓఎన్జిసి ఏటా దాదాపు రూ. 60,000 కోట్ల వరకు ఆదాయాన్ని పొందుతోంది. కానీ అ సంస్థ ఈ పాత్ర అభివృద్దికి చేసింది మాత్రం శూన్యమనే చెప్పాలి. వేలాదికోట్ల రూపాయలు ఈ ప్రాంతంనుంచి దండుకుంటున్నప్పటికీ ఓఎన్జిసి కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఏటా ఈ ప్రాంతాభివృద్దికి ఖర్చుచేస్తోంది. కానీ ఓఎన్జీసీ కార్యకలాపాలవల్ల ఇప్పటికీ ఈ ప్రాంతంలో రహదారులు దెబ్బతిన్నాయి. పైపులైన్లు ఒక్కోసారి హఠాత్తుగా పేలి మంటలు వ్యాపిస్తుండటంతో రైతులు, స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఓఎన్జీసీ ముమ్మరంగా కేజీ బేసిన్ లో డ్రిల్లింగ్ చేస్తుండడంవల్ల పర్యావరణ పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ వల్ల మత్స్య సంపద కనుమరుగైపోతుందని మత్స్యకారులు వాపోతున్నారు. దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఆ సంస్థకు లాభాలు వస్తుంటే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది.
http://www.teluguone.com/news/content/krishna-24-11876.html





