కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం: కోటిపల్లి, నరసాపురం రైల్వేలైన్.. సాకారం దిశగా ముందడుగు.!

Publish Date:Sep 27, 2026

Advertisement

కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం  కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్‌ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యంపై  కోనసీమ జెన్‌జీ  రాష్ట్రపతి కార్యాలయానికి చేసిన ఫిర్యాదుతో.. కోటిపల్లి, నర్సాపురం రైల్వేలైన్ విషయంలో కదలిక మొదలైంది. జెన్ జీ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం  ఈ అంశంపై రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు నోట్‌ పంపింది.

కోటిపల్లి, నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగి పాతికేళ్లు గడిచినా నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన జెన్ జీ. ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగి సుమారు 25 ఏళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..   రైల్వే ప్రాజెక్టు కోసం కోనసీమలో విద్యార్థులు, యువత చేపట్టిన ధర్నాలకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియోలను   జత చేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. 

ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని  కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్నారని, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం   ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని ఆ ఫిర్యాదులో   వివరించింది. నిరుద్యోగం కారణంగా కోనసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం  రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు నోట్‌ పంపినట్లు తమకు సమాచారం అందిందని కోనసీమ జెన్‌జీ ప్రతినిధులు తెలిపారు. ఇదే అంశంపై రైల్వే శాఖ, సీఎంఓ ప్రతినిధులు తమను సంప్రదింనట్లు తెలిపారు. కోటిపల్లి, నరసాపురం రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో మెరుగైన అనుసంధానం కలిగే అవకాశం ఉందని అన్నారు. 


[Kotipalli Narsapuram Railway Line, Konaseema GenZ, Rashtrapathi Bhavan Response, AP Railway Projects Delay,   Konaseema District, CMO, Telugu One]

By
en-us Political News

  
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.