లా లా- భీమ్లా- పావలా!.. నాయక్ తుప్పురేగ్గొట్టిన నాని!
Publish Date:Feb 27, 2022
Advertisement
భీమ్లా నాయక్ హిట్‌తో పీకే ఫ్యాన్స్ పిచ్చి కాక మీదున్నారు. థియేటర్లలో దుమ్మురేపుతున్నారు. బయటకు వచ్చి జగన్‌రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. మా హీరో సినిమాను అడ్డుకుంటారా? సూపర్ హిట్‌తో జగన్‌రెడ్డికి దిమ్మ తిరిగే జవాబిచ్చాం చూశారా? అంటూ మెడ మీద చెయ్యి పెట్టి ఫోజులిస్తున్నారు. టికెట్ ధరల పెంపు జీవోను కావాలనే ఆలస్యం చేశారని.. జనసేనాని సినిమాలపై సర్కారు కక్ష కట్టిందంటూ కస్సుబుస్సుమంటున్నారు. పీకే ఫ్యాన్స్‌తో పాటు జనసేన, టీడీపీ నేతలు సైతం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. కట్ చేస్తే.. కాస్త ఆలస్యంగా మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. తెలుసుగా ఆయన గారి నోటి తీట. ప్రెస్‌మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. ఎప్పటిలానే చంద్రబాబునూ అనేశాడు. ఇక చిరంజీవిన తెగ వెనకేసుకొచ్చాడు. అన్నయ్యను అనడం తప్పు అంటూ తమ్ముడి తుప్పురేగ్గొట్టారు మంత్రి కొడాలి నాని. భీమ్లా నాయక్ సినిమాను తొక్కేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదని అన్నారు. పుష్ప, అఖండ , బంగర్రాజు సినిమాలకు ఇవే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటేనని.. సినిమాకో నిబంధన విధించే ప్రభుత్వం మాది కాదని మండిపడ్డారు. తల్లి లాంటి సినిమాను కూడా రాజకీయాలకు అడ్డుపెట్టుకునే నీచులు ఉన్నారు.. బ్లాక్ టికెట్ల పేరుతో దోచుకుంటామంటే కుదరదన్నారు. మీకు మీరుగా సినిమా విడుదల చేసుకుని ప్రభుత్వంపై నిందలా? చిరంజీవిని కూడా పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు.. చిరంజీవిని అనడానికి పవన్ కల్యాణ్‌కు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చిరంజీవి, ఆయన సతీమణికి సీఎం దంపతులు భోజనం పెట్టి గౌరవించి పంపిన విషయం మరిచిపోయారా? చిరంజీవిని సీఎం జగన్ ఎంతో గౌరవిస్తారు.. పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవిని సీఎం జగన్ ఆహ్వానించారు.. చిరంజీవిని అవమానించడానికి పవన్‌కు మనసు ఎలా వచ్చింది? జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి గారిని అవమానించొద్దని పవన్ కల్యాణ్‌ను కోరుతున్నా అన్నారు కొడాలి నాని. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగానే పోటీ చేస్తారన్నారు.
అంటూ ఫైర్ అయ్యారు. జీవో విడుదలకు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉందన్నారు మంత్రి కొడాలి నాని.
http://www.teluguone.com/news/content/kodali-nani-fire-on-pawan-kalyan-39-132354.html





