నాని వర్సెస్ నాని.. ఒకరి మంత్రిపదవి హుష్‌కాకి!.. జగన్నాటక సూత్రధారి!
Publish Date:Feb 27, 2022
Advertisement
సీఎం జగన్ కేబినెట్‌లో కొడాలి నాని, పేర్ని నానిలదే హవా. మిగతా మంత్రులంతా.. జస్ట్ ఉన్నారంటే ఉన్నారంతే. ఇక, సలహాదారు సజ్జల సీఎం తర్వాత సీఎం అంత. కృష్ణా జిల్లా వాసులైన నాని అండ్ నానిలు పక్కా వైలెంట్. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టాడంటే.. దుమ్ము దులుపుడే. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా ముందుకొస్తే.. పంచ్‌లే పంచ్‌లు. వారద్దరితో జగనన్నకు, వైసీపీకి లాభమో, నష్టమో వచ్చే ఎన్నికల్లో తేలుతుంది కానీ.. ఆ లోగా ఈ ఇద్దరు నానిలకు ఓ గండం వచ్చిపడే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. ప్రభుత్వం ఏర్పాడి మరో మూడ్నెళ్లలో మూడేళ్లు కానుండటం.. ఇటీవల మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంతో ఈసారి మంత్రిమండలి విస్తరణ తప్పకుండా జరుగుతుందని అంటున్నారు. ఇక, ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని తెలుస్తుండటంతో.. కేబినెట్ కూర్పులో కొత్త జిల్లాల వారీగా లెక్కలు మారిపోనున్నాయి. ఆ జిల్లాల ఈక్వేషనే.. ఇప్పుడు కొడాలి నాని, పేర్ని నానిల పదవులకు ఎసరు పెట్టిందని చెబుతున్నారు. ప్రస్తుత కృష్ణా జిల్లా.. రెండు జిల్లాలుగా ఏర్పడనుంది. ఒకటి కృష్ణా జిల్లా, మరొకటి ఎన్టీఆర్ జిల్లా. నాని అండ్ నాని.. నియోజకవర్గాలు గుడివాడ, మచిలీపట్నం కావడంతో ఆ రెండూ కూడా ఒకే కృష్ణా జిల్లాలోకే వస్తుండటం ఆసక్తికరంగా మారింది. జిల్లాకో మంత్రి పదవి వేసుకున్నా.. 26 జిల్లాలకు 26 మంది. కొన్ని జిల్లాల్లో డిమాండ్ ఎక్కువ. సామాజిక సమీకరణాలూ కీలకం. ఆ లెక్కల్లో.. కొత్త కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నానిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈక్వేషన్ కంప్లీట్ చేసిన జగన్‌రెడ్డి.. ఇద్దరు నానిలలో ఒక్కరినే ఎంచుకున్నట్టు సమాచారం. కేబినెట్ పునర్‌వ్యవస్తీకరణలో ఈసారి కొడాలి నానికి ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. పేర్ని నానికి మాత్రం మరోసారి పదవి వరిస్తుందని చెబుతున్నారు. అందుకు జగన్ లెక్క జగన్‌ది. కొడాలి నాని బూతుల కారణంగా రెండున్నరేళ్లుగా వైసీపీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంతకంటే ఎక్కువే జరిగింది. అధికార పార్టీ నేతలంటేనే ప్రజల్లో అసహ్యం పుడుతోంది. ఇక, అసెంబ్లీలో భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన కామెంట్లపై యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. సరైన సమయంలో సరైన శిక్ష విధించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కొడాలి నాని బూతుల ఓవరాక్షన్ అంతా జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతోందని.. జగనన్న కళ్లల్లో ఆనందం కోసమే నాని అంతలా గొంతుచించుకుంటున్నారని.. అందరికీ తెలిసిందే. అయినా, కొడాలి వల్ల కలిగిన నష్టాన్ని.. ఆయన మంత్రి పదవిపై వేటు వేయడం ద్వారా భర్తీ చేయాలనేది జగన్ ఐడియా..అంటున్నారు. అందుకే, ఈసారి జిల్లాల సాకు చూపించి.. కొడాలి నాని సీటుకు ఎర్త్ పెట్టనున్నారట జగనన్న. ఇక, పేర్ని నానితో కాస్తోకూస్తో లాభమే జరిగింది కానీ.. పెద్దగా నష్టం ఏమీ లేదు. సో.. ఆ ఇద్దరిలో కొడాలి పోస్ట్ ఊస్ట్.. పేర్ని పోస్ట్ సేఫ్...అని తెలుస్తోంది. మరి, జగన్నాటకం ఎలా ఉండబోతోందో...!!
http://www.teluguone.com/news/content/nani-vs-nani-in-ap-cabinate-39-132356.html





